Tomato Pulao: ఇలా సింపుల్‌గా టమాటా పులావ్ చేయండి.. వాసన ఘమఘుమలాడిపోతుంది!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 11:11 PM

రైస్ ఐటెమ్స్‌లో అందరూ సింపుల్‌గా తయారు చేసుకోదగిన వాటిల్లో టమాటా పులావ్ కూడా ఒకటి. ఇది బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైనా తినవచ్చు. లంచ్ బాక్సుల్లోకి సింపుల్‌గా, ఫాస్ట్‌గా అవ్వాలంటే ఈ రెసిపీ చాలా బావుంటుంది. టమాటా పులావ్ చాలా మంది వేర్వేరు స్టైల్స్‌లో చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్ట పడి మరీ తింటారు. వంట రాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ ఈ టమాటా పులావ్..

Tomato Pulao: ఇలా సింపుల్‌గా టమాటా పులావ్ చేయండి.. వాసన ఘమఘుమలాడిపోతుంది!
Tomato Pulao
Follow us on

రైస్ ఐటెమ్స్‌లో అందరూ సింపుల్‌గా తయారు చేసుకోదగిన వాటిల్లో టమాటా పులావ్ కూడా ఒకటి. ఇది బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైనా తినవచ్చు. లంచ్ బాక్సుల్లోకి సింపుల్‌గా, ఫాస్ట్‌గా అవ్వాలంటే ఈ రెసిపీ చాలా బావుంటుంది. టమాటా పులావ్ చాలా మంది వేర్వేరు స్టైల్స్‌లో చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్ట పడి మరీ తింటారు. వంట రాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ ఈ టమాటా పులావ్ నచ్చుతుంది. తక్కువ సమయంలోనే కుక్కర్‌లో.. రుచిగా, కమ్మగా ఉంటుంది. మరి టమాటా పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా పులావ్‌ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

టమాటాలు, రైస్, పులావ్ దినుసులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ లేదా నెయ్యి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి.

టమాటా పులావ్‌ తయారీ విధానం:

ముందుగా కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు పులావ్ దినసులు, పుదీనా, కరివేపాకు ఒకదాని తర్వాత వేసి వేయించు కోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇవి వేగాక బియ్యం వేసి ఒకసారి అంతా కలుపుకుని సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం రుచి చూసుకుని కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టాలి. ఇవి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించు కోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేడి పోయేంత వరకూ పక్కకు వదిలేసి.. సర్వ్ చేసుకోవడమే. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది.