Manchurian Idli: ఇలా వెరైటీగా మంచూరియన్ ఇడ్లీ చేయండి.. గిన్నె ఖాళీ అయిపోతుంది!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 11:40 PM

ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇడ్లీని కేవలం ఆవిరి మీద ఉడికిస్తారు. ప్రతి రోజూ ఇడ్లీ తింటే బీపీ, షుగర్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ చాలా మందికి ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు. అందులోనూ పిల్లలకు ఎప్పుడూ వెరైటీగా కావాలి. ఇడ్లీ తినీ తినీ బోర్ కొట్టి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడూ వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకునే మంచూరియన్ ఇడ్లీకి చట్నీ కూడా అవసరం లేదు. నేరుగా తినవచ్చు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా..

Manchurian Idli: ఇలా వెరైటీగా మంచూరియన్ ఇడ్లీ చేయండి.. గిన్నె ఖాళీ అయిపోతుంది!
Manchurian Idli
Follow us on

ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇడ్లీని కేవలం ఆవిరి మీద ఉడికిస్తారు. ప్రతి రోజూ ఇడ్లీ తింటే బీపీ, షుగర్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ చాలా మందికి ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు. అందులోనూ పిల్లలకు ఎప్పుడూ వెరైటీగా కావాలి. ఇడ్లీ తినీ తినీ బోర్ కొట్టి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడూ వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకునే మంచూరియన్ ఇడ్లీకి చట్నీ కూడా అవసరం లేదు. నేరుగా తినవచ్చు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. వీటిని కేవలం బ్రేక్ ఫాస్ట్‌లానే కాకుండా డిన్నర్‌గా, స్నాక్‌లా కూడా తీసుకోవచ్చు. మరి ఈ వెరైటీ మంచూరియన్ ఇడ్లీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

మంచూరియన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:

ఇడ్లీలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, టమాటా, నువ్వులు, గరం మసాలా, ఉప్పు, పసుపు, చింత పండు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్.

మంచూరియన్ ఇడ్లీ తయారీ విధానం:

ముందుగా ఇడ్లీను వండి చల్లార్చి, ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ వేయాలి. మంటను మీడియంలో ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు వేసి కలర్ మారేంత వరకూ వేయించు కోవాలి. ఇప్పుడు కొద్దిగా చింత పండును తీసుకుని కడిగి.. గిన్నెలో నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు వేగాక.. చింత పండు రసం, నీళ్లు వేసి కాసేపు ఉడికించాలి. ఇది దగ్గర పడుతున్నప్పుడు గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి. కాస్త దగ్గర పడుతున్న క్రమంలో పక్కన పెట్టుకున్న ఇడ్లీలు కూడా వేసి బాగా కలపాలి. పొడి పొడిగా ఉన్నప్పుడు కొత్తిమీర తరుగు, నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మంచూరియన్ స్టైల్ ఇడ్లీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది.