Egg Pakoda: వెరైటీగా ఇలా ఎగ్ పకోడి ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది అంతే!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 10:15 PM

పకోడీల్లో వెజ్ అండ్ నాన్ వెజ్‌ ఎన్నో వెరైటీలు తినే ఉంటారు. అయితే ఎప్పుడూ గుడ్డు పకోడి మాత్రం తిని ఉండరు. కోడి గుడ్లతో ఎలాంటి రెసిపీ తయారు చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి వండుకుంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంతే కాకుండా వెరైటీగా కూడా ఉంటుంది. గెస్టులు ఎవరు వచ్చినా.. ఈజీగా ఈ స్నాక్ తయారు చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ కూడా ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అయితే కేవలం గుడ్డులోని..

Egg Pakoda: వెరైటీగా ఇలా ఎగ్ పకోడి ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది అంతే!
Egg Pakoda
Follow us on

పకోడీల్లో వెజ్ అండ్ నాన్ వెజ్‌ ఎన్నో వెరైటీలు తినే ఉంటారు. అయితే ఎప్పుడూ గుడ్డు పకోడి మాత్రం తిని ఉండరు. కోడి గుడ్లతో ఎలాంటి రెసిపీ తయారు చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి వండుకుంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంతే కాకుండా వెరైటీగా కూడా ఉంటుంది. గెస్టులు ఎవరు వచ్చినా.. ఈజీగా ఈ స్నాక్ తయారు చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ కూడా ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అయితే కేవలం గుడ్డులోని తెల్ల సొనతో మాత్రమే పకోడి తయారు చేయాలి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? ఎగ్ పకోడాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి తరుగు, బ్రెడ్ ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, పచ్చి మర్చి, రెడ్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, చనగపిండి, ఆయిల్.

ఎగ్ పకోడి తయారీ విధానం:

ముందుగా గుడ్లను ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి.. పచ్చ సొనను తీసేసి.. కేవలం తెల్ల సొనను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి ఓ లోతైన గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, పచ్చి మర్చి, పసుపు, అల్లం, వెల్లుల్లి తరుగు, గరం మసాలా, కరివేపాకు, రెడ్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, చనగపిండి, వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి పొడిలా తయారు చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ పొడి కూడా గుడ్ల మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద బాండీ పెట్టి.. ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. కలిపి పెట్టిన మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ పకోడా తయారు. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని.. సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. కావాలి అనుకుంటే ఈ పకోడాను చిల్లీ ఎగ్ పకోడాల కూడా తాళింపు పెట్టుకోవచ్చు.