Chicken Keema Curry: వెరైటీ చికెన్ కీమా కర్రీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!

| Edited By: Janardhan Veluru

Jun 11, 2024 | 12:39 PM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ మాత్రమరే కాదు చికెన్ కీమా కూడా ఆరోగ్యానికి మంచిదే. చాలా మంది మటన్ కీమా మాత్రమే తింటారు. కానీ చికెన్ కీమాను తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. చికెన్ కీమాతో కూడా చాలా రకాల స్నాక్స్ తయారు చేసుకుంటారు. అయితే ఇప్పుడు చికెన్ కీమాతో కర్రీ కూడా ట్రై చేయవచ్చు. చికెన్ కీమాతో కలిపి శనగ పప్పు కర్రీ చేస్తే..

Chicken Keema Curry: వెరైటీ చికెన్ కీమా కర్రీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!
Chicken Kheema Curry
Follow us on

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ మాత్రమరే కాదు చికెన్ కీమా కూడా ఆరోగ్యానికి మంచిదే. చాలా మంది మటన్ కీమా మాత్రమే తింటారు. కానీ చికెన్ కీమాను తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. చికెన్ కీమాతో కూడా చాలా రకాల స్నాక్స్ తయారు చేసుకుంటారు. అయితే ఇప్పుడు చికెన్ కీమాతో కర్రీ కూడా ట్రై చేయవచ్చు. చికెన్ కీమాతో కలిపి శనగ పప్పు కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ కేవలం అన్నంలోకే కాదు.. చపాతీ, పుల్క, రోటీ, పులావ్ ఎందులోనైనా తినవచ్చు. మరి ఈ చికెన్ కీమా కర్రీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, శనగ పప్పు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తి మీర తరుగు, పుదీనా, ఆయిల్.

చికెన్ కీమా కర్రీ తయారీ విధానం:

ముందుగా శనగ పప్పును మూడు సార్లు బాగా కడిగి.. ఓ గంట ముందు నానబెట్టాలి. లేదంటే కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ తెప్పించినా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేశాక.. పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా కొద్దిగా వేసి వేయించాలి. వీటి రంగు మారాక.. ఉడికించి పెట్టుకున్న శనగ పప్పు వేసి ఓ సారి వేయించి.. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడిలు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాక చికెన్ కీమా కూడా వేసి కలపాలి. ఓ పదినిమిషాలు ఉడికించాక.. నీళ్లు వేసి దగ్గర పడేంత వరకూ ఉడికించాలి. నీళ్లు దగ్గర పడుతున్నప్పుడు గరం మాసాలా వేసి మరికాసేపు కుక్ చేయాలి. ఇక కర్రీ ఉడికాక.. దించే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసి దహించేయడమే. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ శనగపప్పు కర్రీ సిద్ధం.