Chicken Garelu: టేస్టీగా, క్రంచీగా చికెన్ గారులు.. ఆహా అదుర్స్ అంతే!

| Edited By: Ram Naramaneni

Dec 22, 2024 | 9:37 PM

గారెలతో చికెన్ తినడం అనేది డెడ్లీ కాంబినేషన్. పండగలకు, ఏదైనా స్పెషల్ డేస్‌‌లో చాలా మంది ఇలా వండుకుని తింటూ ఉంటారు. అయితే చికెన్‌తోనే గారెలు వేసుకోవడం ఎప్పుడైనా ట్రై చేశారా.. ఆహా వేడి వేడిగా తింటే అదుర్స్ అంతే. ఇక మాటలు ఉండవు. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు..

Chicken Garelu: టేస్టీగా, క్రంచీగా చికెన్ గారులు.. ఆహా అదుర్స్ అంతే!
Chicken Garelu
Follow us on

గారెలతో చికెన్ తినడం అనేది డెడ్లీ కాంబినేషన్. పండగలకు, ఏదైనా స్పెషల్ డేస్‌‌లో చాలా మంది ఇలా వండుకుని తింటూ ఉంటారు. అయితే చికెన్‌తోనే గారెలు వేసుకోవడం ఎప్పుడైనా ట్రై చేశారా.. ఆహా వేడి వేడిగా తింటే అదుర్స్ అంతే. ఇక మాటలు ఉండవు. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. సాధారణంగా చికెన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కానీ చికెన్ గారెలు అనేది కొత్త రెసిపీగా చెప్పొచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే.. ఇది నిజంగానే అందరికీ ఫేవరేట్ స్నాక్‌గా మారిపోతుంది. ఇది తయారు చేయడం కూడా ఈజీనే. మరి ఈ చికెన్ గారెలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ గారెలకు కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, బియ్యం పిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, కారం, సోంపు, ఆయిల్.

చికెన్ గారెలు తయారీ విధానం:

ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి ఓ బౌల్‌లోకి తీసుకోండి. చికెన్ కీమా అయితే చాలా ఈజీగా చేయవచ్చు. అదే చికెన్ ముక్కలు తెచ్చుకుంటే మళ్లీ వాటిని మిక్సీలో వేసి కీమాలా మార్చుకోవాలి. కాబ్టటి షాపు నుంచి డైరెక్ట్‌గా చికెన్ కీమా తెచ్చుకోండి. ఈ కీమాని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి, పచ్చి మిర్చి పేస్ట్ లేదా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, జీలకర్ర, సోంపు పొడి, ఓ నాలుగు గంటల ముందు నానబెట్టున్న పచ్చి శనగపప్పు కొద్దిగా వేసి అన్నీ బాగా కలుపుకోండి.

ఇవి కూడా చదవండి

కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ.. గారెలు వేసుకునేందుకు వీలుగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయండి. ఇప్పుడు మిశ్రమాన్ని గారెలుగా చేసి వేసుకోండి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టండి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ వడలు సిద్ధం. వీటిని పుదీనా పచ్చడి, టమాటా కెచప్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.