Catering Style Chicken Fry: క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై ఇలా చేస్తే.. అదిరిపోతుంది అంతే!

చికెన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. అందులోనూ క్యాటరింగ్ చేసే చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్‌గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చికెన్ ఫ్రైని ఎన్నో స్టైల్స్‌లో చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఎక్కువగా క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ చికెన్ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్‌ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు..

Catering Style Chicken Fry: క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై ఇలా చేస్తే.. అదిరిపోతుంది అంతే!
Catering Style Chicken Fry

Updated on: Mar 01, 2024 | 5:01 PM

చికెన్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. అందులోనూ క్యాటరింగ్ చేసే చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్‌గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చికెన్ ఫ్రైని ఎన్నో స్టైల్స్‌లో చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఎక్కువగా క్యాటరింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ చికెన్ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్‌ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యాటరింగ్ స్టైల్‌ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, జీలకర్ర, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, పెరుగు, కసూరి మెంతి, గరం మసాలా, ధనియాల పొడి.

క్యాటరింగ్ స్టైల్‌ చికెన్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రం చేసి.. గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్‌లో పసుపు, ఉప్పు, కారం వేసి కనీసం ఓ గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి.. మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసి.. నీరంతా పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఉల్లి పాయ, పచ్చి మిర్చి ముక్కలు కలర్ మారేంత వరకూ వేయించాలి. ఇప్పుడు ఉల్లి పాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా వేయించిన చికెన్‌ కూడా ఇందులో వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు చికెన్‌లో పెరుగు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మరో నిమిషం పాటు వేయించిన తర్వాత కసూరి మేతి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకూ బాగా వేయించుకోవాలి. నెక్ట్స్ కొద్దిగా కొత్తి మీర, కరివేపాకు వేసి బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ చికెన్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. టేస్ట్ బాగా రుచిగా ఉంటుంది.