Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్.. నవరాత్రుల్లో బెస్ట్ రెసిపీ..

| Edited By: Ravi Kiran

Oct 12, 2024 | 9:15 PM

ఆవకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆవకాయ అనగానే ఎవరి నోట్లో అయినా నీళ్లు ఊరుతాయి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి, ఆవకాయ, ముద్దపప్పు వేసుకుని తింటే.. ఆహా స్వర్గంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఈ టేస్టు బిర్యానీలకు కూడా ఉండదు. పైగా ఇలా తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. ఆవకాయతో చేసే వెరైటీ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇలా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా..

Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్.. నవరాత్రుల్లో బెస్ట్ రెసిపీ..
Avakayi Rice
Follow us on

ఆవకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆవకాయ అనగానే ఎవరి నోట్లో అయినా నీళ్లు ఊరుతాయి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి, ఆవకాయ, ముద్దపప్పు వేసుకుని తింటే.. ఆహా స్వర్గంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఈ టేస్టు బిర్యానీలకు కూడా ఉండదు. పైగా ఇలా తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. ఆవకాయతో చేసే వెరైటీ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇలా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా.. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయం పడుతుంది. నవరాత్రుల్లో మధ్యాహ్నం భోజనం చేయడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆవకాయ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

అన్నం, ఆవకాయ పచ్చడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ లేదా బటర్, క్యాప్సికం తరుగు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, పచ్చి మిర్చి, సోయా సాస్, టమాటా సాస్, ఉప్పు, మిరియాల పొడి.

ఆవకాయ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పొడి పొడిగా అన్నం వండి పక్కన పెట్టుకోండి. బాస్మతీ రైస్ అయితే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి వీలైతే బాస్మతీ రైస్ తీసుకోండి. లేని వాళ్లు సాధారణ బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టండి. ఈ రైస్‌లో ఆవకాయ పచ్చడి వేసి కలపండి. ఇప్పుడు ఖాళీగా ఉండే కడాయి తీసుకుని అందులో ఆయిల్ లేదా బటర్ వేసుకోండి. ఇది వేడెక్కాక పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించి పక్కన పెట్టాలి. ఇవి వేగా క్యారెట్, క్యాప్సికం తరుగు, క్యాబేజీ, కరివేపాకు వేసి మొత్తం అంతా ఓ రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

అవన్నీ వేగాక మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపి.. ఆవకాయ పచ్చడి కలిపిన అన్నం వేయండి. ఇప్పుడు టమాటా సాస్, సోయా సాస్ కూడా వేసి అంతా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పచ్చడి ఫ్రైడ్ రైస్ సిద్ధం. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సుల్లో కూడా పెట్టొచ్చు.