Kobbari Dosa: కొబ్బరి దోసెలు ఎప్పుడైనా తిన్నారా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

| Edited By: Shaik Madar Saheb

Aug 04, 2024 | 2:51 PM

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో ఎన్నో రకాల దోశలు ఉంటాయి. ఇప్పుడున్న లైఫ్‌స్టైలో మరిన్ని దోశలు కొత్త కొత్తవి వచ్చాయి. దోశలకు లవర్స్ చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఇంట్లో ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ వేసుకుని తిని ఉంటారు. కానీ ఈ దోశ మాత్రం కాస్త వెరైటీగా ఉండటమే కాకుండా.. రుచి కూడా సూపర్‌‌గా ఉంటుంది. అంతే కాదండోయ్ ఆరోగ్యం కూడా. కొబ్బరి తినడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్..

Kobbari Dosa: కొబ్బరి దోసెలు ఎప్పుడైనా తిన్నారా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Kobbari Dosa
Follow us on

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో ఎన్నో రకాల దోశలు ఉంటాయి. ఇప్పుడున్న లైఫ్‌స్టైలో మరిన్ని దోశలు కొత్త కొత్తవి వచ్చాయి. దోశలకు లవర్స్ చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఇంట్లో ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ వేసుకుని తిని ఉంటారు. కానీ ఈ దోశ మాత్రం కాస్త వెరైటీగా ఉండటమే కాకుండా.. రుచి కూడా సూపర్‌‌గా ఉంటుంది. అంతే కాదండోయ్ ఆరోగ్యం కూడా. కొబ్బరి తినడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి ఈ కొబ్బరి దోశలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి దోశలకు కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి తురుము, కొబ్బరి నీరు బియ్యం, చక్కెర, ఉప్పు, ఆయిల్ లేదా నెయ్యి.

కొబ్బరి దోశలు తయారీ విధానం:

ముందుగా ఈ దోశలు తయారు చేసుకోవడానికి బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నీరు, బియ్యం, కొబ్బరి తురుము లేదంటే చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పాన్ తీసుకుని.. వేడి చేయడాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి వేడెక్కాక.. దోశలా వేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే దోశలు తయారు. వీటిని ఏ పచ్చడితో తిన్నా చాలా బావుంటాయి. కాస్త తియ్యగా ఉంటాయి. ఈ దోశలు పిల్లలకు బాగా నచ్చుతాయి. ఎంతో ఆరోగ్యం కూడా.

ఇవి కూడా చదవండి

వీటిని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలా కొబ్బరితో చాలా రకాల దోశలు తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా తినాలి అనుకునేవారు ఈ దోశలను ట్రై చేయండి. అలాగే వీటిని తింటే ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు. అదే విధంగా కొబ్బరి నీరు, కొబ్బరితో తయారు చేస్తాం కాబట్టి.. ఎంతో ఆరోగ్యం. మరింకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి