Curd Idli: పెరుగు ఇడ్లీ..పెరుగు వడ కంటే నెక్ట్స్ లెవల్ టేస్ట్..

| Edited By: Shaik Madar Saheb

Dec 11, 2024 | 10:49 PM

ఇడ్లీలను ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా చేసినా పిల్లలకు నచ్చదు. కాబట్టి ఈ సారి పెరుగు ఇడ్లీ ట్రై ఖచ్చితంగా నచ్చడం ఖాయం. అంతే కాకుండా ఈ రెసిపీని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్‌గా కూడా తినవచ్చు. చాలా ఈజీగా డైజిస్ట్ అవుతుంది. పెరుగు, ఇడ్లీ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది..

Curd Idli: పెరుగు ఇడ్లీ..పెరుగు వడ కంటే నెక్ట్స్ లెవల్ టేస్ట్..
Curd Idli
Follow us on

చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌గా తినే వాటిల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీ చాలా సులభంగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ పది నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీలు తయారైపోతాయి. వేడి వేడి ఇడ్లీలపై కారం పొడి, నెయ్యి వేసుకుని తింటే.. ఆహా టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే. అంత రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీ తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రేగులు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి. ఇడ్లీల్లో ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. ఇడ్లీలను ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా చేసినా పిల్లలకు నచ్చదు. కాబట్టి ఈ సారి పెరుగు ఇడ్లీ ట్రై ఖచ్చితంగా నచ్చడం ఖాయం. అంతే కాకుండా ఈ రెసిపీని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్‌గా కూడా తినవచ్చు. చాలా ఈజీగా డైజిస్ట్ అవుతుంది. పెరుగు, ఇడ్లీ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ పెరుగు ఇడ్లీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:

పెరుగు, తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీలు, తాళింపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, ఎండు మిర్చి, అల్లం తరుగు, కొబ్బరి తురుము, నెయ్యి లేదా నూనె.

పెరుగు ఇడ్లీ తయారీ విధానం:

ముందుగా ఇడ్లీలను ఉడికించి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెరుగును బాగా చిలకాలి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అల్లం తరుగు తరుగు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగగానే తాళింపు దినుసులు వేసి ఓ ఫ్రై చేయాలి. ఇవి కూడా వేయించి.. జీడి పప్పును చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఆ తర్వాతా ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చివరగా కొబ్బరి తురుము వేసి ఒకసారి తిప్పాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇడ్లీలను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు కలిపి ఇడ్లీల మీద వేయండి. ఆ తర్వాత తాళింపును ఇడ్లీలపై వేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెరుగు ఇడ్లీ సిద్ధం. పెరుగు వడల కంటే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి.. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేయవచ్చు.