Chicken Rolls: ఇంట్లోనే హెల్దీగా యమ్మీ చికెన్ రోల్స్.. ఈజీగా తయారు చేసుకోవచ్చు..
పిల్లలకు ఒక పట్టాన ఏదీ సరిగా నచ్చదు. వాళ్లకు వెరైటీగా.. రుచికరంగా ఉండేవాలి కావాలి. అలాగే కొంత మంది పిల్లలు నాన్ వెజ్ అంటే అస్సలు తినరు. ఇలాంటి పిల్లలకు చికెన్ రోల్స్ చాలా బెస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా, స్నాక్‌గా, డిన్నర్‌గా ఎలాగైనా తినొచ్చు. కొద్దిగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటాయి. అలాగే బయట కాకుండా.. ఇంట్లో తయారు చేస్తారు కాబట్టి.. చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చికెన్ రోల్స్‌ని..
పిల్లలకు ఒక పట్టాన ఏదీ సరిగా నచ్చదు. వాళ్లకు వెరైటీగా.. రుచికరంగా ఉండేవాలి కావాలి. అలాగే కొంత మంది పిల్లలు నాన్ వెజ్ అంటే అస్సలు తినరు. ఇలాంటి పిల్లలకు చికెన్ రోల్స్ చాలా బెస్ట్ రెసిపీ. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా, స్నాక్‌గా, డిన్నర్‌గా ఎలాగైనా తినొచ్చు. కొద్దిగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటాయి. అలాగే బయట కాకుండా.. ఇంట్లో తయారు చేస్తారు కాబట్టి.. చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చికెన్ రోల్స్‌ని ఇంట్లోనే ఎప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ రోల్స్‌ని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ రోల్‌కి కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి లేదా మైదా పిండి, చికెన్ కీమా, ఉల్లిపాయలు, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మ రసం, గరం మసాలా, పెరుగు, గుడ్లు, కొత్తి మీర, బ్లాక్ పెప్పర్ పొడి, టమాటా కెచప్, బటర్ లేదా ఆయిల్.
చికెన్ రోల్స్ తయారీ విధానం:
ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మ రసం, గరం మసాలా, పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి ఉడికించాలి. మీడియం మంటలో పెట్టి.. చికెన్ బాగా ఉడికించాలి. చికెన్‌ని రోస్ట్‌లా తయారు చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మరో చిన్న బౌల్‌లో గుడ్లు చితక్కొటి వేసి, అందులోనే ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి ఒక చపాతీ తయారు చేసుకోండి. ఆ చపాతీపై ఆమ్లెట్ పెట్టి.. దానిపై మిరియాల పొడి, టమాటా కెచెప్ రాయాలి. కావాలి అనుకున్నవారు మయోనీస్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాబేజీ, క్యారెట్ తురుము కూడా వేయాలి. ఇప్పుడు దీనిపై చికెన్ మిశ్రమం ఉంచి.. రోల్‌లా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ రోల్స్ సిద్ధం.