Potato Halwa: రొటీన్ కు భిన్నంగా.. బంగాళదుంపలతో రుచికరమైన హల్వా తయారీ విధానం

Potato Halwa: బంగాళ దుంప సర్వసాధారణంగా చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే కూరగాయ. ఈ బంగాళా దుంపలతో కుర్మా, వేపుడు వంటి కూరలు...

Potato Halwa:  రొటీన్ కు భిన్నంగా.. బంగాళదుంపలతో రుచికరమైన హల్వా తయారీ విధానం
Potato Halwa

Updated on: Jun 20, 2021 | 10:19 AM

Potato Halwa: బంగాళ దుంప సర్వసాధారణంగా చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే కూరగాయ. ఈ బంగాళా దుంపలతో కుర్మా, వేపుడు వంటి కూరలు చేసుకుంటాం.. అయితే ఈ బంగాళదుంపలతో ఎంతో రుచికరమైన హాల్వా కూడా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. మరి ఈ బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:

బంగాళదుంపలు 5
మైదా పిండి ఒక కప్పు,
చిక్కటి పాలు ఒక కప్పు,
నెయ్యి అర కప్పు,
చక్కెర పొడి ఒకటిన్నర కప్పు,
జీడిపప్పు
బాదం
కిస్మిస్
యాలకుల పొడి
ఫుడ్ కలర్ చిటికెడు అప్షనల్

తయారీ విధానం :

ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి వాటిపై ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి జీడీ పప్పు, బాదాం పప్పు, కిస్ మిస్ లు వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. బంగాళా దుంప ముక్కలను వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. అలా నెయ్యిలో బంగాళదుంప ముక్కలను బాగా మగ్గించి కమ్మటి వాసన వచ్చిన తర్వాత పాలు పోయాలి. కొంచెం సేపు పాలలో బంగాళాదుంపలు ఉడికిన తర్వాత పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా ఉడికిస్తూ ఉంటె.. పాలు పూర్తిగా కరిగి.. ఆ మిశ్రమం ఓ ముద్దలా తయారు అవుతుంది. కొంచెం ఫుడ్ కలర్ ను నీటిలో కలిపి ఆ బంగారంలా దుంప మిశ్రమంలో వేసుకోవాలి. (ఇది ఇష్టపడిన వారు మాత్రమే). ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం ,యాలకులపొడి వేసి కలియబెట్టి.. కొంచెం నెయ్యి వేసుకుని స్టౌ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి రుచికరమైన బంగాళదుంప హల్వా రెడీ.

Also Read: కార్తీక దీపం సీరియల్ లోని అత్తాకోడళ్ళైన సౌందర్య, దీపల మధ్య నిజజీవితంలో వయసు ఎన్నేళ్లు తేడానో తెలుసా