
మీకు రొయ్యల వంటకాలంటే ఇష్టమా? ఎప్పుడూ రొయ్యల వంటకాలను రొటీన్‌గా చేసుకుంటూ ఉంటారా? అయితే కాస్త వెరైటీగా రొయ్యలతో ఫ్రై ఈ రోజు ట్రై చేద్దాం. రొయ్యల ఫ్రైకి కావల్సిన పదార్ధాలు, దీని తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..
ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. అనంతరం శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పది నిమిషాల వరకు ఉడికించాలి. అనంతరం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూను తీసుకుని రొయ్యలలో వేసి కలిపి సన్న మంట మీద వేడి చేయాలి. ఇవి ఇగిరే లోపు కొబ్బరి, ధనియాలపొడి, జీడిపప్పు, గసాలు, రెండు ఏలకులు, రెండు లవంగాలు వేసి మెత్తని పేస్టు చేయాలి.
మరొక బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకుల పొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని, టొమాటో ముక్కలను వేసి దోరగా వేయించాలి. అది వేగిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు మిశ్రమం వేయాలి. మసాలా వేగిన తర్వాత ఇగరపెట్టిన రొయ్యలను వేసి తగినంత నీటిని వేసి ఉడికించాలి. ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీన ఆకులను వేయాలి. మసాలా మొత్తం రొయ్యలకు పట్టేసి ఇగిరే వరకు వేయించి.. ఆ తర్వాత దించేయాలి. అంతే కమ్మని రొయ్యల వేపుడు రెడీ..!
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.