Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Nuggets: 5 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ చికెన్ నగ్గెట్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

పిల్లలకు బయట ఫుడ్ కి బదులు ఇంట్లో ఏదో ఒక స్నాక్ తయారు చేసి పెట్టడం మంచిదే. కానీ రోజూ ఒక వెరైటీ తయారు చేయడం అంత తేలిక కాదు. అది కూడా వారికి నచ్చేలా చేయడం. అయితే ఓ సారి ఇలా చికెన్ నగ్గెట్స్ ను ట్రై చేయండి. పిల్లలకే కాదు ఇంట్లో ఎవరైనా గెస్ట్ లు వచ్చినా కూడా ఈ సింపుల్ రెసిపీ అద్భుతంగా ఉంటుంది.

Chicken Nuggets: 5 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ చికెన్ నగ్గెట్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..
Hot Chicken Nuggets Recepie
Follow us
Bhavani

|

Updated on: Mar 25, 2025 | 1:10 PM

బయట నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే భయంగా ఉందా.. అందుకే ఇంట్లోనే టేస్టీగా 5 నిమిషాల్లో ఇలా చికెన్ నగ్గెట్స్ చేసేసుకోండి. ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా, పార్టీలైనా, స్నాక్స్ గా అయినా సరే మీ టైమ్ ను ఏమాత్రం వేస్ట్ చేయకుండా మీకు కాంప్లిమెంట్స్ తెప్పించే రెసిపీ ఇది. మరి ఇంట్లోనే వేడి వేడి చికెన్ నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూసేయండి.

చికెన్ నగ్గెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు, బ్రెడ్‌క్రంబ్స్ – 3, గుడ్లు – 2, ఉప్పు – అవసరమైనంత, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కార్న్ ఫ్లోర్, సాస్, నూనె

తయారీ విధానం..

రెండు మూడు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ను చివర్లు కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి. దీన్ని పౌడర్ లా తయారు చేయండి.

అదే జార్ లో 200 గ్రాముల బోన్ లెస్ చికెన్ ను వేసుకోండి. అందులోనే ముప్పావు టీస్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఆరిగానో, పావు స్పూన్ వేయించిన జిలకర పొడి, చిటికెడు పసుసు, తగినంత ఉప్పు, ఒక సపూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

రెండు గిన్నెలు తీసుకుని ఒక దాంట్లో రెండు కోడిగుడ్లు బీట్ చేసుకుని వేసుకోవాలి. మరొక దాంట్లో బ్రెడ్ క్రంబ్స్, మరొక దాంట్లో కార్న్ ఫ్లోర్ లేదా మైదా ను వేసుకుని ఉంచుకోవాలి.

మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని చేతితో నచ్చిన షేప్లో ఉండల్లా చుట్టుకోవాలి. చేతికి కాసంత నూనె అద్దుకుంటూ అన్నింటిని ఇలా రోల్ చేసుకోవాలి.

ఒక్కో రోల్ ను ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో అద్దుకోవాలి. చివరగా మరోసారి ఎగ్ మిశ్రమంలో ముంచుకుని బ్రెడ్ క్రంబ్స్ లో అటూ ఇటూ తిప్పి దాన్ని వేడి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు వేడి, క్రిస్పీ చికెన్ నగ్గెట్స్ సిద్ధంగా ఉన్నాయి. మీరు దీన్ని మీకు నచ్చిన ఏ సమయంలోనైనా తయారు చేసుకుని ఆనందించవచ్చు.

వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..
ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..