Horse Gram Benefits: మాంసం కంటే ఉలవల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. హార్స్ గ్రామ్ (Horse Gram Benefits)లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు నిండి ఉన్నాయి. అందుకే మాంసాహారం కంటే పౌష్టికాహారం ఎక్కువగా ఉన్న పప్పు దినుసుల్లో ఉలవలు మొదటివరుసలో ఉంటాయి. ఉలవల (Horse Gram) రంగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అయితే.. ఈ ఉలవలతో పలు అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉలవలు తినడం వల్ల కలిగే ఐదు ప్రధాన ప్రయోజనాల (Health Benefits) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్ర పిండాల్లో రాళ్లు..
కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉలవలను తినాలి. ఇవి మూత్ర పిండాల్లోని రాళ్లను పగలగొట్టి శరీరం నుండి బయటకు తీయడంలో చాలా సహాయకారిగా ఉంటుంది
మధుమేహం..
ఈ రోజుల్లో మధుమేహం సమస్య సర్వసాధారణంగా మారింది. మీరు కూడా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ ఆహారంలో ఉలవల పప్పును చేర్చుకోవాలి. చక్కెర స్థాయిని నియంత్రించడంలో, తగ్గించడంలో ఉలవలు సహాయకరంగా ఉంటాయి.
సంతానోత్పత్తి..
తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులకు కూడా ఈ పప్పు ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఆహారంలో చేర్చుకోవచ్చు.
బరువు..
ఉలవల పప్పులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.. ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి ఇష్టపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
బలహీనత..
ఉలవల్లో ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బలహీనంగా ఉన్నవారు.. చిన్నపాటి పని చేసిన అలసటగా అనిపించే వారు.. శరీరంలో రక్తం లేనివారు ఆహారంలో ఉలవలను చేర్చుకోవాలి.
Also Read: