Egg Fried Rice: క్షణాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ గా బెస్ట్ ఎంపిక.. రెసిపీ ఏమిటంటే

తరచుగా ప్రజలు అల్పాహారంగా తినే ఆహారంలో గుడ్లను చేర్చుకుంటారు. గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డుని ఉడికించి మాత్రమే కాదు గుడ్డుతో వివిధ రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఉదయం క్షణాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Egg Fried Rice: క్షణాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ గా బెస్ట్ ఎంపిక.. రెసిపీ ఏమిటంటే
Egg Fried Rice

Updated on: Jul 24, 2025 | 1:46 PM

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఉదయం గుడ్డు ఉడికించి తినడం లేదా గుడ్డుతో అల్పాహారం చేసుసుకుని తినడం చాలా సులభం. అయితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే సిపుల్ టిప్స్ చేసుకోవచ్చు. ఇది రుచికరమినదే కాదు.. ఆరోగ్యకరమైనది.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఉదయం గొప్ప బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ గా తినొచ్చు. ఈ రోజు సింపుల్ టిప్స్ తో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు

  1. అన్నం- 2 కప్పులు (చల్లని అన్నం)
  2. గుడ్లు-2
  3. ఉల్లిపాయ-1 (సన్నగా తరిగిన)
  4. వెల్లుల్లి రెబ్బలు-2 (సన్నగా తరిగినవి)
  5. ఇవి కూడా చదవండి
  6. క్యారెట్ -1/2 కప్పు(సన్నగా తరిగిన)
  7. బఠానీలు- 1/4 కప్పు
  8. స్వీట్ కార్న్ -1/4 కప్పు
  9. సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు
  10. ఆయిస్టర్ సాస్ -1 టేబుల్ స్పూన్
  11. నల్ల మిరియాల పొడి- 1/2 టీస్పూన్
  12. ఉప్పు- రుచికి సరిపడా
  13. నూనె- వేయించడానికి

తయారీ విధానం:

  1. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. నూనె వేసి వేడి చేసి, ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  2. ఇప్పుడు క్యారెట్లు, బఠానీలు, స్వీట్ కార్న్ వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
  3. తరువాత ఒక గిన్నెని తీసుకుని అందులో గుడ్లను పగలగొట్టి సోన వేసి .. వాటిని కలపండి.
  4. తర్వాత గిలకొట్టిన గుడ్లను పాన్ లో ఉన్న కూరగాయల మిశ్రమంలో పోసి నెమ్మదిగా కలుపుతూ ఉండండి.
  5. గుడ్లు ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించిన బియ్యం వేసి బాగా కలపాలి.
  6. సోయా సాస్, ఆయిస్టర్ సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  7. అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. గ్యాస్ ఆపివేసి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఒక ప్లేట్‌లో తీసుకుని ఉల్లిపాయలు, నిమ్మ కాయ ముక్కలతో అలంకరించి పిల్లలకు అందించండి. వద్దు అనకుండా మెతుకు మిగలకుండా తినేస్తారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..