Carrot Juice: క్యారెట్‌ ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? ఇలా తీసుకున్నారంటే ఆ సమస్యలకు స్వస్తి పలికినట్లే..

|

Mar 07, 2023 | 8:20 AM

చాలా మంది పచ్చి క్యారెట్స్‌ను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పచ్చివి తినేకంటే జ్యూస్‌గా చేసుకుని తాగటం మంచిది. ప్రతిరోజు..

Carrot Juice: క్యారెట్‌ ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? ఇలా తీసుకున్నారంటే ఆ సమస్యలకు స్వస్తి పలికినట్లే..
Carrot Juice Health Benefits
Follow us on

క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన కూరగాయలలో ఒకటి. ఇంకా క్యారెట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారట్స్‌లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చాలా మంది పచ్చి క్యారెట్స్‌ను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పచ్చివి తినేకంటే జ్యూస్‌గా చేసుకుని తాగటం మంచిది. ప్రతి రోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు, పిండిపదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇంకా ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. 250 ఎం.ఎల్ క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు 96 , ప్రోటీన్ 2 గ్రాములు, కొవ్వు 1 గ్రాము కంటే తక్కువ, పిండి పదార్థాలు 22 గ్రాములు, చక్కెరలు 9 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ A 255% , విటమిన్ సి 23% , విటమిన్ K31% , పొటాషియం 15% ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తీసుకుంటే శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్ పిగ్మెంట్లు లుటిన్, జియాక్సంతిన్‌లను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే అస్థిర అణువులతో పోరాడుతాయి. మరి ఈ క్యారెట్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

క్యారెట్ జ్యూస్‌ ప్రయోజనాలు

కంటి సంరక్షణ: క్యారెట్ లో ఉండే వివిధ పోషకాల కారణంగా కళ్ళకు మేలు చేస్తుందని అంటారు. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళకు ఎంతో అవసరమైన విటమిన్ ఇది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు సంబంధిత మచ్చలు, ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి: కూరగాయలు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే వాటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి బలపడేందుకు సహకరిస్తాయి. విటమిన్, ఏ, సి రోగనిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడే కీలకమైన వాటిని క్యారెట్ అందిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ డ్యామేజ్ ని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

షుగర్ లెవల్స్: మధుమేహంతో బాధపడే వాళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి. క్యారెట్ జ్యూస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థం. అందుకే డయాబెటిక్ రోగులకు చాలా మంచి ఎంపిక. ఇదే కాదు గట్ లో మంచి బ్యాక్టీరియా ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

చర్మ  సంరక్షణ: క్యారెట్ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులోని కెరొటీనాయిడ్స్ సూర్యుని UV కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

కాలేయం పనితీరు: యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, కెరొటీనాయిడ్స్ ఉన్నాయి. ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) నుంచి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నిరోధిని: క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు కారణమయ్య ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..