Health Tips: లంచ్‌లో వీటిని తినకండి.. పొట్ట తగ్గాలంటే పక్కన పెట్టక తప్పదు మరి..!

|

Feb 16, 2022 | 9:10 AM

Weight Loss: బరువు తగ్గడంతోపాటు ఫిట్‌గా ఉండాలంటే లంచ్‌లో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: లంచ్‌లో వీటిని తినకండి.. పొట్ట తగ్గాలంటే పక్కన పెట్టక తప్పదు మరి..!
Food
Follow us on

Health Tips: బరువు తగ్గడానికి చాలా కష్టపడాల్సిన పనిలేదు. కొన్ని చిన్న టిప్ పాటిస్తే చాలు. ఊబకాయం(Weight Loss) ఇట్టే తగ్గిపోతుంది. మీరు మీ ఆహారం, జీవనశైలిని సరిదిద్దుకుంటే కచ్చితంగా బరువు తగ్గొచ్చు. చాలా మంది బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనాన్ని నియంత్రించడం గురించి మాట్లాడతారు. అయితే, మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని సమతుల్యంగా ఉంచుకుంటే, బరువు తగ్గే పని మరింత సులభం అవుతుంది. అవును, బరువు తగ్గించే ప్రక్రియలో మధ్యాహ్న భోజనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మన కడుపు నిండుగా ఉంచుతుంది. తినాలనే కోరికలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో తినే వాటి గురించి ఆలోచించాలి. ఫిట్‌గా ఉండేందుకు మీరు లంచ్‌లో ఏయే పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి లంచ్..
పండ్లు, కూరగాయలు- పండ్లు, కూరగాయలు తక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో, బరువు తగ్గడానికి, మేం కాలానుగుణ లభించే పండ్లు, కూరగాయలపై దృష్టి పెట్టాలి. దీని కోసం, మీ ప్లేట్‌లో కనీసం 50 శాతం పండ్లు, కూరగాయలతో నింపాలి. ఈ పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీనితో పాటు మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి.

ప్రాసెస్ చేసిన పదార్థాలు- మిల్లెట్ వంటి తృణధాన్యాలు, అన్ పాలీస్ చేసిన ధాన్యాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. అలాగే జీవక్రియను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే ప్రాసెస్ చేసిన పదార్థాలు, పిండి, మైదాతో చేసిన పదార్థాలు మీ బరువును పెంచుతాయి. కాబట్టి మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు, పప్పులను చేర్చుకుంటే మంచిది. భోజనంలో తక్కువ పిండి పదార్థాలు తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ మొత్తాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం మీరు పప్పు, గుడ్లు, చేపలు, చికెన్ తీసుకోవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read: Diabetes diet: తెలుసా! ఈ జ్యూస్‌ తాగారంటే 3 గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది..

Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?