Superfoods: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ సూపర్ ఫుడ్స్ తింటే ప్రయోజనాలెన్నో.. అవేంటో తెలుసుకోండి..

|

May 07, 2022 | 5:09 PM

Superfoods: బాలీవుడ్ నటి సోహా అలీ ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిద్రలేచిన తర్వాత కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకుంటానని తెలిపింది. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడతాయాని ఆమె పేర్కొంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Superfoods: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ సూపర్ ఫుడ్స్ తింటే ప్రయోజనాలెన్నో.. అవేంటో తెలుసుకోండి..
Follow us on

బాలీవుడ్ సెలబ్రిటీలు తమను తాము ఫిట్‌(Fitness)గా ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి నటీనటులు చాలా మంది ఉన్నారు. వారి ఫిట్‌నెస్, మంచి ఆరోగ్యం(Health) చూసి వారి వయస్సును అంచనా వేయలేం. అదేవిధంగా బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌ని చూసి ఆమె వయసు 43 ఏళ్లు అని ఊహించలేం. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్స్(Superfoods) తీసుకుంటుంది. ఆమె ఉదయం కాఫీ, వెన్న లేదా జామ్‌తో టోస్ట్, గుడ్లు తీసుకుంటుంది. ఇది చాలా మంచి ఆహార కలయికఅ ని ఆహార నిపుణులు అంటున్నారు.

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..

ఈ హీరోయిన్ మాత్రమే కాదు.. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి ఆహారాలనే తీసుకుంటుంటారు. అయితే, కరోనా మహమ్మారి నుంచి వీళ్ల డైట్‌లో కొన్ని సూపర్‌ఫుడ్స్ వచ్చి చేరాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించడమేకాక రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటానని ఈ బాలీవుడ్ క్యూటీ చెబుతోంది. మీరు కూడా అందాన్ని పెంచుకోవడాని, వయసు తక్కువగా కనిపించేందుకు ఇలాంటి పదార్థాలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

బాదం: బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియని వారుండరు. బాదంలో రాగి, జింక్, ఐరన్, అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ అల్పాహారానికి ముందు బాదంపప్పు తింటూ ఎంతో ప్రయోజనం ఉంటుంది. పౌష్టికాహార నిధి కాబట్టి బాదంపప్పు తినడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి.

చియా విత్తనాలు: ఇవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలను తింటే, అందులో ఉన్న అన్ని పోషకాలను మనం పొందవచ్చు. అయితే వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటే మరెంతో ఉపయోగకరంగా మారతాయి. ఇవి చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచి శరీరానికి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి.

బొప్పాయి: బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బొప్పాయి తిన్న తర్వాత అల్పాహారానికి మధ్య దాదాపు 45 నిమిషాల గ్యాప్ ఉంచుకునేలా చూసుకోవాలి.

పుచ్చకాయ: ప్రతి ఒక్కరూ అల్పాహారంలో పండ్లను తీసుకోవాలని నిపుణులు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో అల్పాహారంగా పుచ్చకాయ తీసుకుంటే చాలా మంచింది. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీనిని తినడం వల్ల తీపి ఆహారం పట్ల కోరిక తగ్గుతుంది.

గోరువెచ్చని నీరు, తేనె: ఉదయం నిద్రలేచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, సగం నిమ్మకాయ కలిపి తాగాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చూస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించాం. వీటిని పాటించాలంటే మాత్రం ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Also Read: Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!