Herbal Tea: శీతాకాలంలో చాలా మంది ప్రజలు జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పితో బాధపడుతుంటారు. వాటిని వదిలించుకోవడానికి ఇంట్లో వివిధ రకాల చిట్కాలను పాటిస్తారు. చాలామంది వేడి వేడి టీ తాగుతారు. కానీ హెర్బల్ టీ దీని కంటే ఉత్తమమైనది. శరీరాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అటువంటి ఐదు హెర్బల్ టీల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. బ్లాక్ టీ
టీ ప్రియులు కెఫిన్ టీకి బదులుగా బ్లాక్ టీని తీసుకోవచ్చు. దీంతో గొంతునొప్పి, వాపు తగ్గుతుంది. బ్లాక్ టీ చాలా కాలంగా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తున్నారు. ఈరోజు నుంచే దీనిని తాగడం ప్రారంభించండి.
2. పుదీనా టీ
పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా చాలా మంచిది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు ఒకసారి పుదీనా టీ తాగాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
3. చమోమిలే టీ (మూలికా టీ)
ఇది గొప్ప మూలికా టీగా పరిగణిస్తారు. ఇది గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఈ హెర్బల్ టీని తీసుకోవడం ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
4. ములేతి టీ (మూలికా టీ)
గొంతు సంబంధిత సమస్యలని తగ్గించుకోవడానికి ములేతి టీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడానికి పని చేస్తాయి. ఈ రెమెడీని పాటించడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది.