Brinjal Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు..! వారికి విషంతో సమానం

|

Feb 20, 2024 | 7:11 PM

వంకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఈ కూరగాయలను ఆరోగ్యంగా చేస్తాయి. అయితే, వంకాయ తినడం కొంతమందికి హానికరం అని మీకు తెలుసా..? కొన్ని వ్యాధులతో బాధపడుతున్నవారు వంకాయ తినడం వల్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అదేవిధంగా వంకాయ కొందరికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. వంకాయను ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాం.

Brinjal Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు..! వారికి విషంతో సమానం
Brinjal
Follow us on

Health Effects Of Eating Brinjal: వంకాయ గురించి తెలియని వారుండరు..ఎందుకంటే, మన భారతీయ వంటకాలలో వంకాయకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటుంటారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో వంకాయతో విభిన్న వంటకాలను తయారు చేస్తుంటారు. అలాంటి వంకాయ కూర రుచిలో రారాజు వంటిది అని చెప్పాలి. ఇకపోతే, వంకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఈ కూరగాయలను ఆరోగ్యంగా చేస్తాయి. అయితే, వంకాయ తినడం కొంతమందికి హానికరం అని మీకు తెలుసా..? కొన్ని వ్యాధులతో బాధపడుతున్నవారు వంకాయ తినడం వల్ల లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అదేవిధంగా వంకాయ కొందరికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. వంకాయను ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాం.

ఎముకలు బలహీనంగా ఉన్నావారు..

ఎముకలు బలహీనంగా ఉన్నవారు, ఎముక సంబంధిత సమస్యలు ఉన్నవారు వంకాయను తినకూడదు. నిజానికి, వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎముకలు మరింత బలహీనపడతాయి.

ఇవి కూడా చదవండి

రుమటాయిడ్ రోగులు..

రుమటాయిడ్ రోగులు లేదా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. వంకాయ తినడం వల్ల శరీరంలో వాత దోషం పెరుగుతుంది. ఇది కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. మీ కీళ్లలో నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు..

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారికి వంకాయ తీసుకోవడం హానికరం. వంకాయ గింజలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే కిడ్నీ సంబంధిత వ్యాధులు కలిగిన వారు వంకాయ నియోగానికి దూరంగా ఉండాలి.

పైల్స్ పేషంట్స్..

పైల్స్ లేదా హెమరాయిడ్స్ తో బాధపడేవారు కూడా వంకాయను తినకూడదు. నిజానికి వంకాయ తింటే పైల్స్ సమస్య మరింత తీవ్రమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..