Aloe Vera Juice: కలబంద జ్యూస్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఏమవుతుందో తెలుసా!

|

Feb 27, 2024 | 4:55 PM

ఒక గ్లాస్ కలబంద రసం మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది అనేక ప్రధాన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. వాతావరణం మారుతున్నా కొద్దీ చర్మంలోని మెరుపు మసకబారుతుంది. ఈ జ్యూస్‌ని రోజూ తాగితే అందమైన చర్మం మీ సొంతమవుతుంది. అయితే, ఇలాంటి కలబంద జ్యూస్ రోజూ తాగితే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

Aloe Vera Juice: కలబంద జ్యూస్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఏమవుతుందో తెలుసా!
Aloe Vera Juice
Follow us on

కలబంద, అలోవెరాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కలబంద రసం తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. చాలా మంది దీన్ని రోజూ తీసుకుంటారు. రుచిలో చేదుగా ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని ఇష్టపడరు. కానీ, ఎక్కువ మంది ఈ కలబందను చర్మానికి, జుట్టు సమస్యలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. నిజానికి కలబంద రసం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయని మీకు తెలుసా..? అందుకే కలబందను వివిధ ఆయుర్వేద వంటకాలు, టానిక్ లలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కలబంద రసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ కలబంద మీ గట్ ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒక గ్లాస్ కలబంద రసం మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది అనేక ప్రధాన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. వాతావరణం మారుతున్నా కొద్దీ చర్మంలోని మెరుపు మసకబారుతుంది. ఈ జ్యూస్‌ని రోజూ తాగితే అందమైన చర్మం మీ సొంతమవుతుంది. కలబంద చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. మచ్చలను పోగొడుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇక జుట్టుకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. వెంట్రుకలు అందంగా తయారవుతాయి. కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు సిల్కీగా మారుతుంది. అందుకే ఈ కలబందను స్కిన్, హెయిర్ ప్రొడక్ట్స్ లో విరివిగా వాడుతుంటారు.

శరీరంలో రక్తహీనతతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ కలబంద తినాలి. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. బలహీనమైన శరీరం ఉన్నవారు రోజూ కలబందను తీసుకోవచ్చు. ఇది మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ శరీరంలో ఉండే విష వ్యర్థపదార్థాలను బయటకు పంపుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఈ కలబంద జ్యూస్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కలబంద శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇది చాలా మేలు చేస్తుంది. అలోవెరా శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. కలబంద రసంలో శరీరానికి చాలా ముఖ్యమైన యాంటీడిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు ఉన్నాయి. మలబద్ధకం, అజీర్తితో బాధపడేవారు కూడా కలబంద రసాన్ని తీసుకోవాలి. కలబందను ప్రీబయోటిక్ గా ఉపయోగించవచ్చు. ఎందుకంటే గట్‌లో మంచి బ్యాక్టీరియాను ఉంచడానికి కలబంద తోడ్పడుతుంది. దీనిలో ఎసిమానైన్, గ్లూకోమానెన్, అక్సెమనోస్, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి గట్ ను రక్షించడంలో సహాయపడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..