Raw Tomatoes: పచ్చి టమాటాలతో బోలెడు లాభాలు.. బీపీ, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు పరార్‌..!

|

Jan 09, 2024 | 8:06 AM

ఈ టమాటా తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడం వల్ల చర్మం ముడతలు క్రమక్రమంగా తగ్గుతాయి. అందుకే ఇన్ని లాభాలు ఉన్నపచ్చి టమాటా కనీసం ఇప్పుడైనా తినడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన లాభాలు పొందవచ్చు.

Raw Tomatoes: పచ్చి టమాటాలతో బోలెడు లాభాలు.. బీపీ, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు పరార్‌..!
Raw Tomatoes
Follow us on

పచ్చి టమోటాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టమాటాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్‌ ఎ అలాగే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. పచ్చి టమాటాలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక పచ్చి టమాటో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా, పచ్చి టొమాటోను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

పచ్చి టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ సంబంధిత కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా పచ్చి ఉపయోగపడుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు గ్రీన్‌ కలర్‌ పచ్చి టమాటా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

పచ్చి టమాటాలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పచ్చి టమాటాలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పచ్చి టమాటాలు కేవలం ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు.. చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

పచ్చి టమాటా తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడం వల్ల చర్మం ముడతలు క్రమక్రమంగా తగ్గుతాయి. అందుకే ఇన్ని లాభాలు ఉన్నపచ్చి టమాటా కనీసం ఇప్పుడైనా తినడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన లాభాలు పొందవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..