Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: ఈ 5 వింటర్ వెజిటేబుల్స్ మీ డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతాయి..!

చలికాలంలో లభించే కొన్ని ఆహారాలు చక్కెరను పెంచడానికి బదులుగా తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శీతాకాలంలో చౌకగా లభించే కొన్ని కూరగాయలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మీ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే కేవలం 20 రూపాయలకే లభించే కొన్ని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Diabetes Diet: ఈ 5 వింటర్ వెజిటేబుల్స్ మీ డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతాయి..!
Winter Vegetables
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2024 | 7:13 AM

చలికాలంలో మనం తీసుకునే చాలా ఆహారాలు డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఎందుకంటే చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొవ్వుపదార్థాలు, అధిక చక్కెర కలిగిన ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా తింటారు. దీని వల్ల చలికాలంలో మధుమేహాన్ని అదుపు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, చలికాలంలో లభించే కొన్ని ఆహారాలు చక్కెరను పెంచడానికి బదులుగా తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శీతాకాలంలో చౌకగా లభించే కొన్ని కూరగాయలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మీ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే కేవలం 20 రూపాయలకే చలికాలం కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. పచ్చి బఠానీలు..

చలికాలంలో లభించే అత్యంత చౌకైన కూరగాయలలో పచ్చి బఠానీలు ఒకటి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. అయితే, కొంతమంది బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని అనుకుంటారు. అయితే ఇందులో చాలా ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

2. ముల్లంగి..

శీతాకాలంలో పండించే ముల్లంగి ఈ సీజన్‌లో మంచి ధరకు లభిస్తుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక. ముల్లంగిని శీతాకాలంలో సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది కడుపు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

3. క్యారెట్..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు క్యారెట్ తీసుకోవడం మంచిది కాదని చాలా మంది అనుకుంటారు. కానీ, అది అలా కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్‌ను సరైన పరిమాణంలో తీసుకోవచ్చు. ఇది మధుమేహం వల్ల కలిగే అనేక అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది.

4. మెంతులు..

అధిక రక్త చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతులు దివ్యౌషధంగా చెబుతారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మెంతి గింజలు లేదా ఆకులు కూడా రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. మెంతులు శీతాకాలంలో పండుతాయి. ఈ సీజన్‌లో దాని ధర తక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కేవలం రూ.20 విలువైన పచ్చి మెంతికూరను రెండు రోజుల పాటు తినవచ్చు.

5. బచ్చలికూర..

సాధారణంగా మీరు ఏ సీజన్‌లోనైనా పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలను తినొచ్చు. కానీ, బచ్చలికూర శీతాకాలంలో ఎక్కువగా పండిస్తారు. ఈ సీజన్‌లో దీని ధర కూడా తగ్గుతుంది. బచ్చలికూర సలాడ్ రూపంలో తీసుకోవడం లేదా ఏదైనా కూరగాయ లేదా పప్పులో కలుపుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..