Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ప్రత్యేక లడ్డు.. మీ ఆహారంలో చేర్చుకుంటే..!

మైగ్రేన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది. మాంగనీస్ మెదడుకు ప్రత్యేకించి ముఖ్యమైనది. కొన్ని నాడీ సంబంధిత పరిస్థితుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఉపవాస సమయంలో వినియోగించే రాజ్‌గిరా ఐరన్‌కు కూడా ప్రధాన మూలం. రాజ్‌గిరా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు రావు. అంతే కాకుండా ఆరోగ్యానికి..

Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ప్రత్యేక లడ్డు.. మీ ఆహారంలో చేర్చుకుంటే..!
Rajgira Health Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2024 | 7:07 AM

How To Lower Bad Cholesterol: అధిక కొలెస్ట్రాల్ స్థాయి మీ గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే.. గుండెపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌ వంటి సమస్యలకు దారి తీస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ చరిత్ర కారణంగా.. కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఒకసారి సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే.! కొన్ని ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలు పాటిస్తే మాత్రం మందుల అవసరం లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాజ్‌గిరాను తినడం వలన చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తీసుకురావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రాజ్‌గిరాను అమరాంత్ లేదా రామదాన ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రాజ్‌గిరాలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది. మాంగనీస్ మెదడుకు ప్రత్యేకించి ముఖ్యమైనది. కొన్ని నాడీ సంబంధిత పరిస్థితుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఉపవాస సమయంలో వినియోగించే రాజ్‌గిరా ఐరన్‌కు కూడా ప్రధాన మూలం. రాజ్‌గిరా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు రావు. అంతే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

బరువు తగ్గుతారు..

ఇవి కూడా చదవండి

రాజ్‌గిరాలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కారకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. రాజ్‌గిరా శరీరంలో ఆకలిని ప్రేరేపించే హార్మోన్‌ను కూడా నియంత్రిస్తుంది. తద్వారా ఆకలి, అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇంకా, అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల శరీర కొవ్వు, బరువు పెరుగుట ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలంటే ఖచ్చితంగా రాజ్‌గిరాను మీ ఆహారంలో చేర్చుకోండి.

ఎముకలకు బలం..

మాంసకృత్తులు, కాల్షియం సమృద్ధిగా ఉన్న రాజ్‌గిరా తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, రెగ్యులర్ డైట్‌లో ఏదో ఒక రూపంలో రాజ్‌గిరాను తీసుకోవటం వల్ల ఎముక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

తక్కువ కొలెస్ట్రాల్..

కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు. ఇది రక్తంలో అధికంగా ఉన్నట్లయితే రక్త నాళాలను తగ్గిస్తుంది. రాజ్‌గిరాలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుందిజ

జీర్ణక్రియలో సహాయపడుతుంది..

రాజ్‌గిరా, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు.

రాజ్‌గిరా ఎలా తీసుకోవాలి..

రాజ్‌గిరను సాధారణంగా లడ్డూల రూపంలో తింటారు. అయితే మీరు ఇష్టపడితే, నానబెట్టిన తర్వాత తినవచ్చు. అంతేకాదు కొంతమంది దీనిని సలాడ్‌తో తినడానికి ఇష్టపడతారు. వేసవిలో రాజ్‌గిరా వినియోగాన్ని తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే దాని లక్షణాలు శరీరంలో వేడిని కలిగిస్తాయి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..