Gummidikaya Pulusu: గోదావరి జిల్లా స్పెషల్.. అమ్మమ్మ స్టైల్ లో తియ్య గుమ్మడికాయ పులుసు కూర తయారీ..

|

Feb 11, 2022 | 10:47 AM

Gummidikaya Pulusu: గుమ్మిడి కాయ లేదా తియ్య గుమ్మిడి కాయ(Sweet Pumpkin) ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో దొరుకుంతుంది. భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానం ఉన్నా.. ఆంధ్రులకు మాత్రం..

Gummidikaya Pulusu: గోదావరి జిల్లా స్పెషల్.. అమ్మమ్మ స్టైల్ లో తియ్య గుమ్మడికాయ పులుసు కూర తయారీ..
Follow us on

Gummidikaya Pulusu: గుమ్మిడి కాయ లేదా తియ్య గుమ్మిడి కాయ(Sweet Pumpkin) ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో దొరుకుంతుంది. భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానం ఉన్నా.. ఆంధ్రులకు మాత్రం ఈ గుమ్మడి కాయ కూర వెరీ వెరీ స్పెషల్. ఆంధ్రుల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఉపయోగించే గుమ్మడికి కాయను ఉపయోగిస్తూ ప్రత్యేక స్థానం ఇచ్చారు. గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉంది. చైనాలో షుగర్ వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడి కాయ పులుసు కూరని గోదావరి జిల్లా వాసులు ప్రత్యేకంగా రెడీ చేస్తారు. ఈరోజు గోదావరి జిల్లా స్టైల్ లో గుమ్మడికాయ పులుసు కూర తయారీ విధానం తెలుసుకుందాం.

కావాల్సిన ఆహారపదార్ధాలు:
గుమ్మడి కాయ
చింతపండు గుజ్జు
కరివేపాకు
కొత్తిమీర
ఉల్లిపాయ
పచ్చి మిర్చి
ధనియాలు
జీలకర్ర
బెల్లం
పసుపు
కారం
ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
ఎండు మిర్చి
ఆవాలు
జీలకర్ర
వెల్లుల్లి

తయారీ విధానం: ముందుగా మిక్సి తీసుకుని అందులో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గుమ్మడికాయ ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని.. వేడి ఎక్కిన తర్వాత నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ మసాలా, కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చింతపండు గుజ్జు ని నీటి వేసుకోవాలి. అనంతరం పసుపు, మూడు స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం , కొంచెం కరివేపాకు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత గుమ్మిడికాయ పులుసుని వేరే గిన్నెలోకి తీసుకుని.. మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి.. కొంచెం నూనె లేదా నెయ్యి వేసుకుని అందులో ఎండు మిర్చి , ఆవాలు, జీలకర్ర , వెల్లుల్లి , కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని వేయించిన అనంతరం ఈ పోపుని గుమ్మిడికాయ పులుసులో వేసుకోవాలి. అంతే అమ్మమ్మ స్టైల్ లో గోదావరి జిల్లాల స్పెషల్ గుమ్మడికి కాయ పులుసు రెడీ.. ఈ పులుసు తో ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది.

Also Read:  విశాఖలో రోడ్లమీద తిరుగుతూ అఘోరా బీభత్సం.. గంజాయి సేవించి వీరంగం