అల్లం మురబ్బా తింటే అబ్బ అనాల్సిందే.. అలాంటి రోగాలకు దివ్యౌషధం.. తయారు చేసుకోవడం సింపుల్..

అల్లం మురబ్బా, కొందరు అల్లం రబ్బా అని కూడా పిలిచే ఈ రుచికరమైన స్వీట్, స్వీట్ షాపుల్లో లేదా ప్రయాణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రయాణాల్లో వాంతులు, తలనొప్పి లేదా ఒంట్లో కొద్దిగా అసౌకర్యంగా ఉన్నప్పుడు చిన్న అల్లం మురబ్బా ముక్క తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అల్లం మురబ్బా తింటే అబ్బ అనాల్సిందే.. అలాంటి రోగాలకు దివ్యౌషధం.. తయారు చేసుకోవడం సింపుల్..
Ginger Murabba Recipe

Updated on: May 09, 2026 | 7:11 PM

అల్లం మురబ్బా.. దీనిని అల్లం రబ్బా అని కూడా పిలుస్తారు. ఇది భారతీయ సంప్రదాయంలో ఒక ప్రసిద్ధ స్వీట్.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆహార పదార్థం.. ప్రయాణాలలో వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు అల్లం మురబ్బాను తీసుకోవడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా, అల్లం మురబ్బాలో అల్లం సహజ గుణాలు ఉండటం వల్ల శరీరంలోని చిన్నపాటి ఇన్ఫెక్షన్లను (సాధారణంగా పైత్యం అని పిలుస్తారు) తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, జీర్ణ సమస్యలను, పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. అల్లాన్ని మన దైనందిన జీవితంలో ఏదో ఒక రూపంలో ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. స్వీట్ షాపుల్లో లభించే అల్లం మురబ్బాను పోలి ఉండేలా ఇంట్లోనే ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

తయారీకి కావలసిన పదార్థాలు:

  • అల్లం పేస్ట్: అర కప్పు
  • తాటి బెల్లం: రెండు కప్పులు (అల్లం పేస్ట్ పరిమాణానికి నాలుగు రెట్లు)
  • నీరు: ముప్పావు కప్పు (చక్కెర పాకం కోసం)
  • ఉప్పు: చిటికెడు
  • ఐచ్ఛికం: యాలకుల పొడి అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్ రంగు కోసం

అల్లం మురబ్బా.. తయారీ విధానం:

1. అల్లం సిద్ధం చేయడం: ముందుగా అర కప్పు అల్లాన్ని తీసుకుని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ అల్లం ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, నీరు కలపకుండా మెత్తగా పేస్ట్ చేయాలి. వీలైనంత ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన అల్లం పేస్ట్‌ను ఇతర వంటలలో ఉపయోగించుకోవచ్చు.

2. చక్కెర పాకం తయారీ: స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్‌లో రెండు కప్పుల చక్కెరను, ముప్పావు కప్పు నీటిని పోసి వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగి పాకం ముద్ద పాకం (గట్టి ఉండలా వచ్చే) వచ్చే వరకు ఉడికించాలి. చక్కెర స్థానంలో బెల్లం ఉపయోగించాలనుకుంటే, తాటి బెల్లాన్ని వాడటం వల్ల మురబ్బా చక్కగా కుదురుతుంది. పాకం సరిగ్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి, ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేసి, అది గట్టి ఉండలా మారితే పాకం సిద్ధమైనట్టు.

3. అల్లం పేస్ట్ కలపడం: పాకం సిద్ధమైన తర్వాత, అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అర కప్పు అల్లం పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. దీనిని మీడియం ఫ్లేమ్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ఉడికించాలి. పాకం దగ్గరపడి, నురగ నురగగా మారడం మొదలవుతుంది. ఈ దశలో చిటికెడు ఉప్పును కలుపుకోవాలి. రుచి కోసం యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు.

4. చివరి దశ – కన్సిస్టెన్సీ: పాకం మరింత దగ్గరపడి, గట్టి ఉండలా మారాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా పాకాన్ని తీసుకుని చూస్తే అది గట్టి ఉండలా మారి, గిన్నెకు కొడితే ‘టక్ టక్’ అని శబ్దం రావాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఆలస్యం చేసినా పాకం పొడిపొడిగా మారిపోతుంది.

5. మురబ్బాను సెట్ చేయడం: ఒక ప్లేట్‌కు లేదా చెక్కకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, సిద్ధం చేసుకున్న అల్లం మురబ్బా మిశ్రమాన్ని దానిపై పోయాలి. ఒక స్పూన్‌తో సమానంగా పరుచుకుని, రోలర్‌కు నెయ్యి/నూనె రాసి కావలసిన మందంతో రోల్ చేయాలి. ఈ ప్రక్రియను వేగంగా చేయాలి, లేదంటే అల్లం మురబ్బా పొడిపొడిగా మారుతుంది.

6. ముక్కలుగా కట్ చేయడం: అల్లం మురబ్బా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీకు కావలసిన ఆకారంలో ముక్కలుగా గాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయడం కష్టమవుతుంది.

7. చల్లబరచడం – నిల్వ: గాట్లు పెట్టిన తర్వాత అల్లం మురబ్బాను పూర్తిగా చల్లారనివ్వాలి. సుమారు అరగంట నుండి ఒక గంటలో ఇది గట్టిపడుతుంది. చల్లారిన తర్వాత, గాట్లపై మరోసారి కట్ చేసి, ముక్కలను డీమోల్డ్ చేయాలి.

అదనపు చిట్కాలు:

* అల్లం మురబ్బాకు కొద్దిగా పసుపు (పావు టీ స్పూన్) కలిపితే మంచి పసుపు రంగు వస్తుంది.

* చక్కెర బదులు తాటి బెల్లం వాడటం వల్ల రుచి, నాణ్యత మరింత పెరుగుతాయి. సాధారణ బెల్లం వాడితే టెక్స్చర్ కొద్దిగా మారవచ్చు.

* తయారు చేసిన అల్లం మురబ్బాను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఒకటి నుండి రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది.

ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం మురబ్బా ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ, పాకం కన్సిస్టెన్సీని జాగ్రత్తగా గమనిస్తే పర్ఫెక్ట్ అల్లం మురబ్బాను తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us