Health Benefits of Garlic Tea: ఆధునిక ప్రపంచంలో ప్రతీఒక్కరినీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు వంటింట్లోనే అద్భుతమైన ఔషధాలున్నాయి. అలాంటి వంటింటి ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిని కూరల్లో వేయటం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. పరిగడుపున వెల్లల్లి రెబ్బలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే.. బాడీ మెటబాలిజం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.. బరువు నియంత్రణలో ఉంటుంది. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వ్యాధులను నివారించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్లను, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి ఔషధమైన వెల్లుల్లిని టీ చేసుకుని తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ టీ తాగడానికి బదులు వెల్లుల్లి టీ తాగితే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లి టీ ఉపయోగాలు..
‣ ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది.
‣ జీర్ణ శక్తి పెంచడంలో కూడా వెల్లుల్లి టీ బాగా ఉపయోగపడుతుంది.
‣ శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపించడంలో వెల్లుల్లి టీ దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది.
‣ అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతీరోజూ వెల్లుల్లి టీ తాగితే.. బరువు నియంత్రణలో ఉంటుంది.
‣ బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.
‣ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు.. శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది.
‣ శరీరంలో రక్తప్రసరణను పెంచి.. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది.
‣ ఉదర సమస్యలను దూరం చేసి.. అజీర్తి, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది.
‣ అందుకే ప్రతిరోజూ ఐదారు వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
‣ ఘాటు తగ్గించుకునేందుకు కొంచెం తేనె కలుపుకుంటే సరిపోతుంది.
Also Read: