మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి. దీనిలో ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇక వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వలన జలుపు, దగ్గు, మంట, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గడంలోనూ వీటి పాత్ర అధికంగానే ఉంటుంది.
వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వలన క్రమంగా బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ బి 6, సి, ఫైబర్, మాంగనీస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇటీవల కొన్ని ఎలుకల పై నిర్వహించిన ప్రయోగంలో వెల్లుల్లిని ఎనిమిది వారాల పాటు వాటి శరీరంలో ఉండడం వలన బాడీలో ఉన్న కొవ్వును తగిస్తుందని.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. శరీరంలో ఉన్న ఇతర విష పదార్థాలను తొలగిస్తుందని కనుగొన్నారు. అలాగే తేనె.. శరీరంలో గ్లూకోజ్ పెంచడానికి సహయపడుతుంది. గ్లూకోజ్ మెదడులోని షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంచడంతోపాటు, కొవ్వును బర్న్ చేసే హార్మో్న్లు విడుదల చేస్తుంది. అలాగే శోథ నిరోధక లక్షణాల మంటను తగ్గిస్తుంది. దీంతో ఫ్రీరాడికల్స్ వలన వచ్చే వ్యాధులను నివారిస్తుంది.
వెల్లుల్లి పొట్టు తీసి.. ఒక చిన్న కప్పులో టీస్పూ తేనె తీసుకొని పేస్ట్ గా చేసుకోవాలి. అలా దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వదిలెయ్యాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తినాలి. దీనిని ఫ్రిజ్లో మూడు రోజులపాటు నిల్వ చేసుకోవచ్చు. మీ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. రెండు వెల్లుల్లి పాయల కంటే ఎక్కువగా తీసుకోకుడదు. ఎక్కువగా తీసుకుంటే.. నోటిలో లేదా కడుపులో మంట, గుండెల్లో మంట, గ్యాస్, వికారం, వాంతులు, శరీర వాసన, విరేచనాలు ఏర్పడతాయి. మీరు గర్భవతిగా ఉంటే, తల్లి పాలివ్వడం లేదా రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటే, తేనె, వెల్లుల్లిని తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…
కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్చల్..