Food for good memory: మనం రోజూ తీసుకునే ఆహారం మన శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నామన్న దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఆహారం అన్ని రకాల శరీర అవయవాలపై ఎలాగైతే ప్రభావం చూపుతుందో.. మన మెదడుపై కూడా అలాంటి ప్రభావాన్నే చూపుతుంది.
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. అనేక రకాల జీవక్రియలకు మెదడే ఆధారం. మరి అలాంటి మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన శరీరం అంతలా ఆరోగ్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త కొత్త విషయాలను నేర్చుకునే చిన్నారుల మెదడు ఆరోగ్యంగా ఉండాలి. వారిలో జ్ఞాపకశక్తి మెండుగా ఉంటేనే విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు అలాగే గుర్తుంచుకోగలుగుతారు. మరి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడును నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చేసే కొన్ని ఆహార పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం..
* మెదడు క్రీయాశీలకంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి, సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సిట్రస్ పండల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితోపాటు ఆకుకూరలు, తృణ ధాన్యాలను అందించాలి.
* ఇక మెదడుకి ఆరోగ్యాన్ని అందించే వాటిలో పుట్టగొడుగులు కూడా ప్రధానమైనవని చెప్పాలి. వీటిని క్రమం తప్పకుండా చిన్నారులకు అందించాలి.
* చిన్నారులు తీసుకునే ఆహారంలో వేరుశెనగలు, నువ్వులు ఉండేలా చూసుకోవాలి.
* ఎదుగుతున్న చిన్నారులకు రోజూ ఒక కోడి గుడ్డును అందించాలి. వీటిలో ఉండే ప్రోటీన్లు జ్ఞాపకశక్తితోపాటు ఏకాగ్రతను కూడా పెంచుతాయి.
* అంతేకాకుండా బాదంపప్పు, జీడిపప్పు, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను చిన్నారులకు ఆహారంలో భాగం చేయాలి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడును చురుకుగా చేస్తాయి.
* చేపల్లో కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
* ఇక ఆహార పదార్థాలతో పాటు చిన్నారులకు యోగా, ధ్యానం వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలి. ఇవి కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Also Read: Online Marriage: వాళ్లక్కడ.. వీళ్లిక్కడ.. ఆన్‌లైన్ పెళ్లి సందడి! వేడుక ఎలా జరిగిందో చూడండి.
TV Shows: టీవీల్లో పిల్లల కోసం వచ్చే షోలకు పెరిగిన ఆదరణ..సక్సెస్ బాటలో భారతీయ కార్టూన్ షోలు!