Eggs: గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వచేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|

Feb 12, 2022 | 3:28 PM

Eggs: రోజుకు ఒక గుడ్డు తింటే అనార్యోగాలకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఉండే పోషకాలే దీనికి కారణం. అందుకే నాన్‌ వెజ్‌ తినని వారు కూడా గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే..

Eggs: గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వచేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Eggs
Follow us on

Eggs: రోజుకు ఒక గుడ్డు తింటే అనార్యోగాలకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఉండే పోషకాలే దీనికి కారణం. అందుకే నాన్‌ వెజ్‌ తినని వారు కూడా గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే ఒకప్పుడు కేవలం కూరగాయలు, పండ్లను మాత్రమే రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకునే వారు కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రతీ ఒక్క వస్తువును ఫ్రిడ్జిలోనే పెడుతున్నారు. వీటిలో కోడి గుడ్లు కూడా ఒకటి. మరి గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయడం మంచిదేనా.? దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా.? ఒకవేళ నిల్వ చేస్తే ఎన్ని రోజులు చేయొచ్చు లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

* సాధారణంగా కోడిగుడ్లను వీలైనంత వరకు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవడమే మంచిది. ఒక వేళ కచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక బాక్సులో నిల్వ చేసిన గాలి తలగకుండా ఉంచాలి. దీనికి కారణమేంటంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇతర వస్తువుల వాసన గుడ్లకు అంటుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల గుడ్డు రుచిలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది.

* అంతేకాకుండా మనలో చాలా మంది గుడ్లను ఫ్రిడ్జ్‌ డోర్‌ సైడ్‌ ర్యాక్‌లో నిల్వచేస్తుంటారు. ఫ్రిడ్జ్‌ నిర్మాణంలో కూడా ఆ వెసులుబాటు ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్‌ డోర్ ఓపెన్‌ చేయడం, క్లోజ్‌ చేస్తున్న సమయంలో ఉష్ణోగ్రతలో మార్పులు జరుగుతుంటాయి. దీనివల్ల గుడ్డులో బ్యాక్టిరీయా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి గుడ్లను ఒక బాక్సులో ఉంచి ఫిడ్జ్‌ మధ్యలో నిల్వ చేయాలి.

* ఇక గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచినా.. వాటిని వండే ముందు కనీసం రెండు గంటలపాటు బయట ఉంచిన తర్వాతే ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుడ్డు రుచిలో ఎలాంటి మార్పు ఉండదు.

* గుడ్లను ఎక్కువగా వేడిగా, ఎక్కువగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయకూడదని చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తే గుడ్డు పొట్టుపై బ్యాక్టీరియా శరవేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Jason Holder IPL 2022 Auction: విండీస్ ఆల్ రౌండర్‌ను దక్కించుకున్న లక్నో.. కేఎల్ రాహుల్ టీంలో ఎవరున్నారంటే?

Viral Video: వందేళ్ల నాటి గుడ్డు.. రుచిచూసిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు.. మరిన్ని వివరాలు