Dates In Mansoon: వర్షాకాలంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. రోజూ కనీసం ఐదు తినమంటున్న న్యూట్రిషియన్లు

Dates In Mansoon: ఖర్జూరం పండులో పోషకాలు మెండు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే..

Dates In Mansoon: వర్షాకాలంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. రోజూ కనీసం ఐదు తినమంటున్న న్యూట్రిషియన్లు
Dates

Updated on: Aug 01, 2021 | 7:19 PM

Dates In Mansoon: ఖర్జూరం పండులో పోషకాలు మెండు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరం వర్షాకాలంలో తింటే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. అందుల్లనే ఖర్జురాన్ని వర్షాకాలంలో తప్పనిసరిగా తినమని న్యూట్రీషనిస్ట్లు చెబుతున్నారు. ఈరోజు వర్షాకాలంలో ఖర్జూరం తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

*ఖర్జురంలో తక్కువ శాతం గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి పోషక పదార్ధం.
*ఖర్జూరం తినడంవలన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
*ఖర్జూరంలో  ఫైబర్, పొటాషియం ,ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం
*వర్షాకాలంలో ఖర్జూరం తినడంవలన నిద్రలేమి సమస్య ఉండదు.
*వ్యాయామం చేసేవారికి మంచి శక్తిని ఇస్తుంది.
*ఖర్జూరం కాన్స్టిట్యూషన్, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది.
*ఖర్జూరం తినడం వల్ల హెబీ లెవెల్స్ పెరుగుతాయి.
*తరచుగా ఖర్జురం తినడంవలన రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Also Read: Treasure Hunter: లక్ అంటే ఇదీ.. నిధుల వేటలో రెండు కోట్లు విలువైన కాయిన్ లభ్యం.. ఎక్కడంటే