Fermented rice: ఎండకాలంలో చద్దన్నం… పరమౌషధం.. తింటే మీకు ఢోకా లేదు

|

Apr 06, 2022 | 9:11 AM

చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ వేసుకుని.. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఉంటే ఇంక అంతకు మించిన టేస్టీ, బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి.

Fermented rice: ఎండకాలంలో చద్దన్నం... పరమౌషధం.. తింటే మీకు ఢోకా లేదు
Fermented Rice
Follow us on

Chaddannam Health Benefits: మన ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియా(South India)లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వేస్టే చేయకుండా పొద్దున్నే తింటూ ఉంటారు. పనులకు వెళ్లేవాళ్లకు అదే బ్రేక్ ఫాస్ట్. చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ వేసుకుని.. ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ ఉంటే ఇంక అంతకు మించిన టేస్టీ, బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి( immunity )ని పెరుగుతుంది. రోజూ కాకపోయినా.. రాత్రి అన్నం మిగిలినప్పుడు డస్ట్ బిన్‌లో పడేయకుండా.. తెల్లారి చద్దన్నం తింటే ఎంతో ఉపయుక్తం అని  పెద్దవాళ్లు చెబుతారు. చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఎండాకాలంలో పొద్దున్నే చల్ల పోసుకుని చద్దన్నం తినడం వల్ల చలువ చేస్తుంది. చద్దన్నం తింటే మంచిదే.. కానీ ఎక్కువసేపు ఉంచకూడదు. ఉదయన్నే తినేయాలి.

  1. ఉదయాన్నే చద్దన్నం తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
  2. ఎండాకాలంలో పనులకు వెళ్లేవారికి వేడి చేయకుండా ఉండాలంటే చద్దన్నం బెటర్ ఆప్షన్
  3. చద్దన్నంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు
  4. ఇక కాళ్ళకు, చేతులకు ఏదైనా దెబ్బలు తగిలితే.. చద్దన్నం తినడం వలన అవి తొందరగా మానే అవకాశం ఉంటుంది.
  5. చద్దన్నం తింటే అంత త్వరగా వడదెబ్బ బారిన పడరు.
  6. చదన్నం తినడం వల్ల బాడీ స్ట్రాంగ్‌ అవుతుంది
  7. పొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా లభిస్తుంది
  8. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది.
  9. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది
  10. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.
  11. యాంగ్జయిటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తుంది.

గమనిక :- ఈ సమాచారం నివేదికలు.. నిపుణుల సూచనల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి, ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం వైద్యులను సంప్రదించండి.

Also Read: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్