Winter Foods: చలికాలంలో ఇవి సూపర్ ఫుడ్స్.. తిన్నారంటే ఆ వ్యాధులకు చెక్ అంతే!

| Edited By: Anil kumar poka

Dec 13, 2022 | 3:28 PM

వ్యాధి నిరోధకశక్తి ఉంటే వాటిని తట్టుకునే అవకాశం ఉంటుంది. అదే తక్కువ ఉంటే ఈ వైరస్ ల ధాటికి అతలాకుతలం అవుతాం. అందుకే చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే పలు రకాల ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు.

Winter Foods: చలికాలంలో ఇవి సూపర్ ఫుడ్స్.. తిన్నారంటే ఆ వ్యాధులకు చెక్ అంతే!
Fruits
Follow us on

చలికాలం చాలా మంది ఇష్టం. మనుషులకే కాదండోయ్ వైరస్ లకు కూడా! సాధారణంగా ఈ కాలంలో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతలు వాటి మనుగడకు ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో అనేక రకాల ఫ్లూ వైరస్ లు మనుషులపై దాడి చేస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో వీటి సమస్యలు అధికంగా కనిపిస్తాయి. జలుబు, దగ్గు వంటివి వేధిస్తుంటాయి. శ్వాసకోస సంబంధిత జబ్బులు చుట్టుముడుతుంటాయి. అయితే వ్యాధి నిరోధకశక్తి ఉంటే వాటిని తట్టుకునే అవకాశం ఉంటుంది. అదే తక్కువ ఉంటే ఈ వైరస్ ల ధాటికి అతలాకుతలం అవుతాం. అందుకే చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే పలు రకాల ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..

  • క్యారెట్లు: క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి విటమిన్ ఏ ను అందిస్తుంది. క్యారెట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటిశుక్లాలను నివారించవచ్చు. అలాగే క్యారెట్లో యాంటీఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. వీటని ఉడకబెట్టి సూప్ లగా తీసుకోవచ్చు లేదా కూరలాగా కూడా చేసుకుని తినవచ్చు.
  • చిలగడదుంపలు: చిలగడదుంపలలో కూడా బీటా కెరోటిన్, ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తినేయవచ్చు.
  • బ్రోకలీ: ఈ బ్రోకలీ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా కలిగిన నిధి వంటిది. శీతాకాలపు ఫ్లూ సీజన్ లో ఆరోగ్యానికి అండగా ఉంటుంది.
  • రెడ్ క్యాప్సికమ్ / బెల్ పెప్పర్: రెడ్ క్యాప్సికమ్ అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్నది! అలాగే కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఉన్న రెడ్ బెల్ పెప్పర్ రక్తపోటు స్థాయిలను అదుపుచేస్తుంది. అలాగే గుండె జబ్బుల నుంచి సంరక్షిస్తుంది.  వివిధ రకాల క్యాన్సర్‌ కణాలను వృద్ధి చెందకుండా సంరక్షిస్తుంది.
  • సిట్రస్ పండ్లు : నారింజ, కమల, నిమ్మకాయ, ద్రాక్ష పండ్లను సాధారణంగా వేసవిలోనే ఎక్కువగా తీసుకుంటాం. అయితే వీటిని శీతాకాలంలో కూడా తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్ సీ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వివిధ బ్యాక్టీరియాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
  • దానిమ్మపండ్లు: దానిమ్మలు ఆరోగ్యకరమైన శీతాకాలపు పండు.  వీటిలో యాంటీఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి, విటమిన్ బీ6, పొటాషియం ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • ఓట్స్: అత్యధికంగా న్యూట్రియంట్స్ కలిగిన ఓట్స్ చలికాలంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
  • గ్రీన్ టీ: కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ ఉపయుక్తమైన పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, మెదడు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.  శీతాకాలంలో, మీకు వేడి పానీయాలు తాగాలని అనిపించినప్పుడు, చక్కెరతో కూడిన వేడి చాక్లెట్ లేదా కాఫీ కంటే గ్రీన్ టీ తీసుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయి.
  • గింజలు, విత్తనాలు: కాయలు, గింజల్లో అధికంగా ఉండే ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, భాస్వరం, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..