AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే మామిడికాయతో ఇలా చేస్తే.. మటన్ కర్రీ కూడా పనికిరాదు..

వేసవిలో దొరికే పచ్చి మామిడికాయలతో సులభంగా తయారు చేసుకోదగిన చట్నీ రెసిపీ ఇది. పల్లీలు, అల్లం, ఎండు మిర్చి వంటి పదార్థాలతో నోరూరించే రుచిని అందిస్తుంది. ఇడ్లీ, దోశ, అన్నంలోకి ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. పచ్చి మామిడికాయల పులుపుతో ఈ చట్నీని తప్పకుండా ప్రయత్నించండి.

నోరూరించే మామిడికాయతో ఇలా చేస్తే.. మటన్ కర్రీ కూడా పనికిరాదు..
Raw Mango Chutney
Ram Naramaneni
|

Updated on: May 08, 2026 | 6:25 PM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు. పచ్చి మామిడికాయలతో రకరకాల వంటకాలు చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి రుచికరమైన వంటకాల్లో ఒకటి పచ్చి మామిడికాయ చట్నీ.  ఈ చట్నీ రెసిపీ ఇడ్లీ, దోశ, అన్నంతో పాటు అన్ని టిఫిన్‌లకూ అద్భుతమైన కాంబినేషన్. ఈ మామిడికాయ పల్లి చట్నీని తయారు చేయడం చాలా సులభం. దీనికి అవసరమైన పదార్థాలు, తయారీ విధానం కింద ఇవ్వబడింది.

కావలసిన పదార్థాలు:

పచ్చి మామిడికాయ ముక్కలు – ఒక కప్పు (పులుపు మరీ ఎక్కువ లేని మామిడికాయ), మినపపప్పు – 3 స్పూన్లు, వేరుశనగ గుళ్ళు – ఒక గుప్పెడు, అల్లం – 3 అంగుళాల ముక్క (చిన్న ముక్కలుగా తరిగినది), ఎండు మిరపకాయలు – 4-5 (రుచికి సరిపడా), కరివేపాకు – 2 రెమ్మలు, ఉల్లిపాయ – 1 పెద్దది లేదా 2 చిన్నవి (ముక్కలుగా తరిగినది), నూనె – 1 స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – అవసరాన్ని బట్టి

తయారీ విధానం:

ముందుగా ఒక పాన్‌లో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక, మూడు స్పూన్ల మినపపప్పు వేసి కాస్త వేయించుకోవాలి. మినపపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత, ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసి సన్నని మంట మీద అర నిమిషం పాటు నిదానంగా వేయించాలి. తరువాత, చిన్న ముక్కలుగా తరిగిన మూడు అంగుళాల అల్లం ముక్కలను వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలోకి మీ రుచిని బట్టి నాలుగు నుండి ఐదు ఎండు మిరపకాయలను వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ పదార్థాలు కాస్త వేగిన తర్వాత, రెండు రెమ్మల కరివేపాకును చేర్చి, అది చిటపటలాడిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిదనం పోయి, మెత్తబడే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ మామిడికాయ మరీ పుల్లగా ఉండకూడదు. నేను ఒక పెద్ద మామిడికాయలో సగం తీసుకుని ఈ చట్నీ చేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత, సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు కొద్దిగా రంగు మారి, మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. వేయించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.

దీనిలో మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు గ్లాసు వరకు నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ చట్నీ మరీ మెత్తగా కాకుండా, కాస్త బరకబరకగా ఉండాలి. ఈ చట్నీని మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. అంతే, వేసవి ప్రత్యేకమైన, రుచికరమైన పచ్చి మామిడికాయ చట్నీ సిద్ధం. ఇది ఇడ్లీ, దోశ, రైస్ లోకి అద్భుతమైన సైడ్‌డిష్‌గా ఉంటుంది. కొబ్బరి లేని ఈ చట్నీని వేసవిలో తప్పకుండా ప్రయత్నించండి.

Follow Us
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్