Chicken Manchurian Recipe : చికెన్ మంచూరియా చైనీస్ వంటకం అయినప్పటికీ మనదేశంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచూరియా వెజ్ ప్రియులను , నాన్ వెజ్ ప్రియులను అలరిస్తుంది. ఈరోజు బోన్ లెస్ చికెన్ మంచూరియా తయారీ తెలుసుకుందాం,,
తయారీకి కావాల్సిన పదార్ధాలు :
బోన్ లెస్ చికెన్ -1/4 కేజీ
తరిగిన ఉల్లిపాయలు-అరకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీ స్పూన్
కోడిగుడ్డు -ఒకటి
మైదాపిండి,
సోయాసాస్,
చిల్లీ సాస్,
వెనిగర్,
కార్న్ ఫ్లోర్,
టమోటా సాస్:
ఒక్కో టీస్పూన్
ఉప్పు, నూనె: తగినంత
ఆంధ్ర చికెన్ మంచూరియ తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేయించి ఓ ప్లేటులోకి తీసుకోవాలి.
తర్వాత మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు వేగనివ్వాలి. అనంతరం ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేరిస్తే సరి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ మంచురియా రెడీ. దీనిని ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు
Also Read: ఓ రిక్షావాలా తనయుడు మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ గా ఎంపిక… అతని సక్సెస్ స్టోరీ పదిమందికి స్ఫూర్తివంతం