Belly Fat: బెల్లీఫ్యాట్ తగ్గాలంటే.. రాత్రిపూట ఈ డ్రింక్స్ తాగితే సరి.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..

|

Aug 11, 2022 | 6:45 AM

మన క్రమం తప్పకుండా వ్యాయాలతోపాటు, సరైన సమయానికి తినడం, మన ఆరోగ్యానికి సరిపడే పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Belly Fat: బెల్లీఫ్యాట్ తగ్గాలంటే.. రాత్రిపూట ఈ డ్రింక్స్ తాగితే సరి.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
Belly Fat Drinks
Follow us on

వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, ఆహారపు అలవాట్లపై నిఘా ఉంచడం కాకుండా ఆహారంలో జీవక్రియను పెంచే పానీయాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. లేట్‌గా తినడం వల్ల మన శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఇది పొట్ట చుట్టూ చేరడం వల్ల విపరీతమైన సమస్యలు కూడా వస్తుంటాయి. ఇందుకోసం మన క్రమం తప్పకుండా వ్యాయాలతోపాటు, సరైన సమయానికి తినడం, మన ఆరోగ్యానికి సరిపడే పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడే కొన్ని పానీయాల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయ జ్యూస్..

ఒక దోసకాయ, రుచి ప్రకారం నిమ్మరసం, 1/2 కప్పు నీరు.

ఇవి కూడా చదవండి

ఎలా చేయాలంటే..

జ్యూస్ లాగా అయ్యే వరకు అన్నీ కలపండి. మీరు రుచికి అనుగుణంగా నీటిని కూడా జోడించవచ్చు.

ఎలా పనిచేస్తుంది..

ఈ జ్యూస్ కొవ్వును కరింగించే లక్షణాలు ఉన్నాయి. దోసకాయలో జీరో కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది మంటతో పోరాడుతుందని కూడా అంటారు.

అల్లం టీ..

1/2 tsp తురిమిన అల్లం, 2.1 కప్పుల నీరు, 1 tsp తేనె (ఐచ్ఛికం), 1 tsp నిమ్మరసం.

ఎలా చేయాలంటే..

ఒక కప్పు వేడినీటిలో తురిమిన అల్లం వేసి కనీసం 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పులో వడకట్టి తాగాలి.

ప్రయోజనం..

రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు బరువుగా లేదా ఉబ్బరంగా అనిపిస్తే, అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

బరువు తగ్గడంలో సహాయం..

ఈ పానీయం శరీరం నుంచి విషాన్ని, వ్యర్థాలను బయటకు పంపడం వలన బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.