చికెన్‌ బిర్యానీ విత్ పెరుగు.. కుమ్మేసుకుంటున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..!

|

Aug 26, 2024 | 1:50 PM

చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. చికెన్‌ తిన్న తర్వాత చాలా మంది పెరుగు తింటుంటారు..అయితే, ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును తినటం మంచిది కాదని చెబుతున్నారు.

చికెన్‌ బిర్యానీ విత్ పెరుగు.. కుమ్మేసుకుంటున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..!
Chicken Biryani With Curd
Follow us on

చికెన్ పేరు వింటే చాలా మంది నోళ్లలో నీళ్లు తిరుగుతాయి. చాలా మంది వారానికి ఒక్కసారైనా చికెన్ తింటారు. కొందరు చికెన్ కర్రీ చేస్తే మరికొందరు చికెన్ ఫ్రై చేస్తారు. మరికొందరు కబాబ్స్, గ్రిల్డ్ చికెన్, తందూరీ ఇలా చికెన్‌ చాలా వెరైటీలు తింటుంటారు భోజనప్రియులు. ఇక పోతే, చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది తమ ఆహారంలో చికెన్‌ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే చికెన్ తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చికెన్ కర్రీని అన్నంలోకి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. చివర్లో పెరుగు తింటారు. అన్నం, పెరుగు, చికెన్ రుచి అద్భుతమైనది. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పెరుగుతో చికెన్ తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. చికెన్‌ తిన్న తర్వాత చాలా మంది పెరుగు తింటుంటారు..అయితే, ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును తినటం మంచిది కాదని చెబుతున్నారు. చికెన్‌ ప్రభావం మన శరీరంపై వేడిగానూ, పెరుగు ప్రభావం శరీరంపై చల్లగానూ ఉంటుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

అంతేకాదు.. చికెన్‌తో పాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయంటున్నారు. చాలా మందికి రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. చికెన్ తినే రోజు పాలు తాగకపోవడమే మంచిదని నిపుణలు చెబుతున్నారు. లేదంటే దురద, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..