Lifestyle: రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.? బకెట్ తన్నేస్తారు జాగ్రత్త!

|

Jan 14, 2025 | 5:08 PM

కూల్ డ్రింక్స్. ప్రపంచవ్యాప్తంగా అంద‌రూ ఇష్టప‌డేవి. పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీ, ఇతర జంక్‌ఫుడ్ తిన్న త‌ర్వాత చాలామంది త‌ప్పకుండా కూల్ డ్రింక్ తాగుతారు. అయితే, కూల్ డ్రింక్స్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజ‌నాలు లేక‌పోగా ప్ర‌తికూల ప్రభావాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. రెగ్యుల‌ర్‌గా శీత‌ల‌ పానీయాలు తాగేవారు అధిక బ‌రువు, మధుమేహం, ఇత‌ర వ్యాధుల‌బారిన ప‌డ‌తార‌ని ప‌లు అధ్యయ‌నాల్లో తేలింది.

Lifestyle: రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.? బకెట్ తన్నేస్తారు జాగ్రత్త!
Cold Drinks 4
Follow us on

కూల్ డ్రింక్స్ తాగేవారిలో జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని, త‌ద్వారా కొత్త విష‌యాల‌ను నేర్చుకునే సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ని తాజా అధ్యయ‌నంలో తేలింది. పార్టీ, ఫంక్షన్.. ఏదైనా కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే. ఏ ఇద్దరు కలిసినా కూల్‌డ్రింక్ కడుపులోకి వెళ్లాల్సిందే. ఇక ప్రయాణాల్లో వాటి వినియోగం గురించి చెప్పక్కర్లేదు. శీతల పానీయాలను అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడుతుందన్న విషయం తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు.

అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం కూల్‌డ్రింక్ పేరెత్తడానికే భయపడిపోతారు. శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడుతున్నారట. అంతేకాదు, 12 లక్షల మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 డయాబెటిస్ కేసుల్లో 9.8 శాతం మంది తీపి పానీయాలు తీసుకోవడం వల్లే దీని బారినపడినట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. టాక్సిన్స్ సరిగ్గా బయటకు వెళ్లకపోతే అది ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా శీతల పానీయం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి లోపం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని తేల్చారు. ముఖ్యంగా చిన్నపిల్లల‌కు శీత‌ల‌పానీయాలు తాగే అల‌వాటు ఉంటే త్వర‌గా మాన్పించాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి