Diabetes Care: డయాబెటిస్ రోగులకు వరం ఈ 5 పండ్లు.. దెబ్బకు షుగర్ కంట్రోల్ కావాల్సిందే..

డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే చనిపోయే వరకు పట్టిపీడిస్తూనే ఉంటుంది..

Diabetes Care: డయాబెటిస్ రోగులకు వరం ఈ 5 పండ్లు.. దెబ్బకు షుగర్ కంట్రోల్ కావాల్సిందే..
Diabetes Care
Follow us

|

Updated on: May 22, 2024 | 3:36 PM

డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే చనిపోయే వరకు పట్టిపీడిస్తూనే ఉంటుంది.. అయితే.. మంచి జీవనశైలి, ఆహారంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండ్లు తినడం మంచిది కాదని చెబుతారు. అయితే, కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం కంటే తక్కువ కాదని.. వాటిని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తినడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ 5 రకాల పండ్లలో ఏదైనా ఒకదాన్ని రోజూ తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులలో బ్లడ్ షుగర్ పెరగదు… ఇంకా కంట్రోల్ లో ఉంటుంది.. ఆ పండ్లు ఏంటో తెలుసుకోండి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న స్ట్రాబెర్రీలను తినాలి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీల మాదిరిగానే రాస్ప్‌బెర్రీస్‌లో కూడా ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

చెర్రీస్‌లో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష రుచికరమైనది మాత్రమే కాదు.. వాటిలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

క్రాన్‌బెర్రీ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉదయం పూట ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్