Weight Loss Tips: కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగేది ఇదే..! కష్టపడకుండా స్లిమ్‌ అవుతారు..!!

|

Jun 24, 2024 | 11:46 AM

కరివేపాకు రసం చేయడానికి, ముందుగా కరివేపాకులను కడిగి నీటిలో ఉడకబెట్టాలి. కొంత సమయం తరువాత, ఈ నీటిని ఫిల్టర్ సహాయంతో వడపోసి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మరొక పద్ధతి ప్రకారం, దీని ఆకులను చూర్ణం చేసి నిమ్మకాయ, తేనెతో కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలని గుర్తుంచుకోండి.

Weight Loss Tips: కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగేది ఇదే..! కష్టపడకుండా స్లిమ్‌ అవుతారు..!!
Curry Leaves
Follow us on

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఉబకాయం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. దీని వల్ల అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇందుకోసం మన వంటింట్లో ఉండే సహాజ పదార్థాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కూరలోంచి ఈజీగా తీసి పడేసే కరివేపాకు ఆకులు అధిక బరువు సమస్యను పరిష్కరిస్తుందని మీకు తెలుసా..?

కరివేపాకుతో బరువు తగ్గడం ఈజీ..

కరివేపాకు సువాసన కోసం ప్రతి ఒక్కరూ దాన్ని వివిధ వంటలలో ఉపయోగిస్తుంటారు. ఈ ఆకును ఉపయోగించి చట్నీ, పొడిని కూడా తయారుచేస్తారు. మసాలా కోసం ఉపయోగించే కరివేపాకు వంటలో రుచిని పెంచుతుంది. అంతే కాదు శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాటిలో చాలా ముఖ్యమైనది ఊబకాయం. ఊబకాయాన్ని తగ్గించడంలో కరివేపాకు ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఇనుము, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

చాలా వరకు మొదట పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోతుంది. ఇలాంటప్పుడు కరివేపాకును తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది లిపిడ్లు, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కరివేపాకు రసం చేయడానికి, ముందుగా కరివేపాకులను కడిగి నీటిలో ఉడకబెట్టాలి. కొంత సమయం తరువాత, ఈ నీటిని ఫిల్టర్ సహాయంతో వడపోసి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మరొక పద్ధతి ప్రకారం, దీని ఆకులను చూర్ణం చేసి నిమ్మకాయ, తేనెతో కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలని గుర్తుంచుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..