Challa Punugulu: టిఫిన్ గానే కాదు స్నాక్స్ గా కూడా చల్ల పునుగులు అదుర్స్.. ఎలా చేసుకోవాలంటే..

ఉదయమే తప్పని సరిగా టిఫిన్ ని తినాలని పోషకాల నిపుణులు సూచిస్తున్నారు. అందుకనే ఉద‌యాన్నే టిఫిన్‌గా ఉప్మా, దోస‌, పోహ ఇలా ఏదో ఒక‌టి చేస్తారు. అల్ఫాహారంగా లేదా స్నాక్స్ గా టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేయడానికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. అలాంటి టిఫిన్ స్నాక్స్ లో ఒకటి చల్ల పునుగులు. ఈ రోజు రుచికరమైన చల్ల పునుగుల రెసిపీ గురించి తెల్సుకుందాం..

Challa Punugulu: టిఫిన్ గానే కాదు స్నాక్స్ గా కూడా చల్ల పునుగులు అదుర్స్.. ఎలా చేసుకోవాలంటే..
Challa Punugulu ]

Updated on: May 04, 2025 | 8:56 PM

టిఫిన్, స్నాక్స్ అంటే పిల్లల కోసం టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేసే అల్పాహారం. సాధారణంగా ఇడ్లీ, దోస, పూరీ, పరోటా, ఆలు పకోడీ, చపాతీ వంటి ఆహారపదార్ధాలను స్నాక్స్ గా లేదా టిఫిన్ గా చేసుకుని తింటారు. ఈ రోజు ఉదయం టిఫిన్, లేదా సాయంత్రం స్నాక్స్ కోసం ప్యాక్ చేయడానికి అనువైన స్నాక్ చల్ల పునుగులు. బియ్యం పిండితో చేసుకునే ఆరోగ్యకరమైన బొండాలు. ఈ రోజు చల్ల పునుగుల రెసిపీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

బియ్యం పిండి – 1 కప్పు

గోధుమ పిండి- అర కప్పు

ఇవి కూడా చదవండి

పుల్లటి పెరుగు- ఒక కప్పు

నూనె – వేయించానికి సరిపడా

వంట సోడా లేదా బేకింగ్ సోడా – చిటికెడు

ఉప్పు – రుచికి సరిపడా

జీల కర్ర – రెండు స్పూన్లు

ఉల్లిపాయలు – రెండు

అల్లం – చిన్న ముక్క

పచ్చి మిర్చి – 3

కొత్తిమీర

కరివేపాకు

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండి, గోధుమ పిండి తీసుకుని అందులో ఒక స్పూన్ నూనె వేసి బాగా పిండికి పట్టేలా కలపండి. ఇప్పుడు ఉప్పు, వంట సోడా వేసుకుని బాగా కలిపి.. అందులో కప్పు పెరుగు వేసుకుని పిండిని కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి అల్లం, కరివేపాకు, కొత్తమీర వీసి బాగా కలుపుకోవాలి. పిండిలో ఉప్పు రుచి చూసుకుని పక్కకు పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసుకుని నూనెను వేడి చేయాలి. ఇప్పుడు మంట తగ్గించి పునుగుల కోసం రెడీ చేసుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా నూనెలో వేసుకోవాలి. మొదటి వేసిన పునుగులను సంగం వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని మళ్ళీ కొన్ని నూనె వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తర్వత ముందు తీసి పక్కకు పెట్టుకున్న పునుగులను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో అందిస్తే ప్లేట్ ని క్షణాల్లో ఖాళీ చేస్తారు.

గమనిక: ఈ చల్ల పునుగులను ఉదయం టిఫిన్ గా వేసుకోవాలనుకుంటే రాత్రి పిండిని నాన బెట్టాలి. అదే సాయంత్రం స్నాక్స్ గా చేసుకోవాలనుకుంటే ఉదయం పిండిని కలుపుకోవాలి. అప్పుడు చల్ల పునుగులు మెత్తగా వస్తాయి

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.