Coronavirus Vaccine: కరోనా కల్లోలం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఇక భారత్ లో కోవిడ్ అదుపులోకి వచ్చింది అని సంతోషించినంత సేపు లేదు.. తగ్గినట్లు తగ్గి.. మల్లి కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతూ.. భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా 45 ఏళ్ల లోపువారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు కొన్ని నియమనిబంధనలు పాటించాలని వైద్య బృందం కోరుతుంది. తినే తిండి దగ్గరనుంచి వేసుకునే మందుల వరకూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది.
ఎందుకంటే టీకా తీసుకున్న కొందరిలో జ్వరం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రభావంతో శరీరంలో వేడి పెరిగి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకని వ్యాక్సిన్ తీసుకున్న వారు . సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ తర్వాత సూప్స్ తీసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే వేడి తగ్గుతుంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జలుబు చేస్తే.. పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి చేసిన చికెన్ సూప్ తాగితే ఉపశమనం ఉంటుంది. అదే శాకాహారులు క్యారెట్, బీన్స్, పాలకూర, బ్రకోలీ, క్యాప్సికమ్, పుట్టగొడుగు సూప్ తాగొచ్చు.
ఉదయం 6 గంటలకు : నానబెట్టిన ఐదు బాదం గింజలు, కొన్ని ఎండుద్రాక్షలు
అల్లం-నిమ్మగడ్డితో చేసిన టీ
8 గంటలకు : కివీ పండు, తీసుకునే అల్పాహారంలో జీలకర్ర పచ్చిమిర్చి పుదీనా ఉండేలా చూసుకోవాలి
11 గంటలకు: టమాటా, క్యారెట్ సూప్ పసుపు, పెప్పర్ పౌడర్ తప్పనిసరిగా వేసుకోవాలి.
లంచ్ : రైస్, నిమ్మరసంతో సలాడ్, అవిసె గింజల పొడి , జీలకర్ర పొడి వేసిన మజ్జిగ,
స్నాక్స్ సమయంలో : రెండు వాల్‌నట్స్, రెండు ఖర్జూరాలు, ఒక గ్లాస్ పుచ్చకాయ రసం.
సాయంత్రం : దానిమ్మ గింజలు, గుమ్మడి గింజలు
డిన్నర్ : నిమ్మరసంతో మొలకల సలాడ్, కూరగాయలు పప్పుతో చిరుధాన్యాల కిచిడి
ఇక నిద్రపోయే ముందు తప్పని సరిగా పాలల్లో పసుపు కలిపినవి తాగాలి.
అయితే రాత్రి భోజనం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.. అంతేకాదు..సమయానికి నిద్రపోవాలి.
Also Read: గొర్రెలకు అందాల పోటీలు.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన గొర్రెలు.. వీడియో వైరల్