Atukula Pulihora: ఈజీ మేడ్ టిఫిన్ : కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం

|

Jun 28, 2021 | 1:50 PM

Atukula Pulihora: దక్షిణాది లో ఆంధ్రా వంటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్, హాట్,స్పైసీ ఇలా డిఫరెంట్ గా ఉండడంతో.. ఆంధ్ర వంటలకు ఇతర రాష్ట్రాలవారు కూడా ఫిదా..

Atukula Pulihora: ఈజీ మేడ్ టిఫిన్ : కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం
Poha Pulihora
Follow us on

Atukula Pulihora: దక్షిణాది లో ఆంధ్రా వంటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్, హాట్,స్పైసీ ఇలా డిఫరెంట్ గా ఉండడంతో.. ఆంధ్ర వంటలకు ఇతర రాష్ట్రాలవారు కూడా ఫిదా.. ఒక ప్రత్యేకమై మాసాలతో పాటు ఎండు మిర్చి పౌడరు, ఎండు మిర్చిని కూడా కూరల్లో వంటలో ఉపయోగిస్తూ..  స్పెషల్ టెస్టు తెస్తారు వంటలకు.. పులిహోర అందరికీ తెలిసిన వంటకమే.. అయితే అటుకులతో కూడా డిఫరెంట్ వంటలకు తయారి చేసుకోవచ్చు. ఈరోజు కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం తెలుసుకుందాం

కావాల్సిన పదార్థాలు: 

అటుకులు – 2 కప్పులు
కొబ్బరి పాలు- 1 కప్పు
నిమ్మకాయ – 1
జీడిపప్పు (ఇష్టమైనవారు వేసుకోవచ్చు )
వేరుసెనగలు -3 చెంచాలు
కరివేపాకు- నాలుగు రెబ్బలు
నూనె- 4 చెంచాలు
పచ్చిమిర్చి – 2
ఉప్పు- తగినంత
ఉల్లిపాయ – 1

పోపుదినుసులు: 

ఆవాలు
మినపప్పు
శనగపప్పు
ఎండుమిర్చి

తయారుచేసే విధానం 

కొబ్బరిపాలలో అటుకుల్ని పది నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత బాణలిని స్టౌ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత నూనె పోసి  నూనె కాగిన తర్వాత పోపుదినుసులు శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఆవాలు వేసి.. తర్వాత పచ్చి మిర్చి, కరివేపాకు, వేరుసెనగలు, వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి. అనంతరం కొబ్బరిపాలల్లో నానబెట్టిన అటుకులు వేసి.. తగినంత ఉప్పు చేర్చి కలియతిప్పి దింపేయాలి. వేరే పళ్ళెంలోకి నిమ్మరసం పిండి చల్లారిన అటుకుల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. రుచికరమైన అటుకుల పులిహోర రెడీ.

Also Read: 9 పగళ్లు, 8 రాత్రులతో వైష్ణవి దేవి సహా ఉత్తర భారతదేశ యాత్రకు షెడ్యూల్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ