Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

|

Feb 15, 2022 | 1:21 PM

Coconut Dosa: దక్షిణ భారత వంటకాల్లో కొన్ని రుచికరమైన వంటకాలు కూడా ఉన్నాయి. ఇందులో కొబ్బరి దోసె కూడా ఒకటి. దీని తయారీకి 3 పదార్థాలు ఉపయోగిస్తారు. కొబ్బరి,

Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?
Coconut Dosa
Follow us on

Coconut Dosa: దక్షిణ భారత వంటకాల్లో కొన్ని రుచికరమైన వంటకాలు కూడా ఉన్నాయి. ఇందులో కొబ్బరి దోసె కూడా ఒకటి. దీని తయారీకి 3 పదార్థాలు ఉపయోగిస్తారు. కొబ్బరి, ఉప్పు, దోస పిండి అవసరం. మీరు ఎప్పుడైనా తయారుచేయవచ్చు. దీన్ని పుట్టినరోజు పార్టీలో కూడా చేయవచ్చు. లంచ్ బాక్స్‌లో ఆఫీసుకి కూడా తీసుకెళ్లవచ్చు. తయారు చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. రుచికరమైన సాంబార్, చట్నీతో సర్వ్ చేస్తే సూపర్.

కొబ్బరి దోసెకి కావలసినవి..

6 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి, 1 కిలో దోస పిండి, ఉప్పు అవసరం, కొద్దిగా శుద్ధి చేసిన నూనె

కొబ్బరి దోస ఎలా తయారు చేయాలి

1. ముందుగా గ్రైండర్‌లో కొబ్బరి తురుము, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

2. ఇప్పుడు మీడియం మంట మీద నాన్-స్టిక్ పాన్ ఉంచి కొద్దిగా ఆయల్ వేయాలి. తర్వాత దోస పిండిలో కొబ్బరి కలపండి.

3. పాన్ వేడి అయిన తర్వాత దానిపై ఒక గరిటెతో పిండిని పోసి గుండ్రంగా చేయండి. మంట తక్కువగా పెట్టండి.

4. ఇప్పుడు పాన్‌లో స్ప్రెడ్ చేసిన పిండి చుట్టూ 2-3 చుక్కల నూనె పోసి, దిగువన లేత బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత తిప్పి మరో వైపు కూడా ఇలాగే ఉడికించాలి.

5. ఒక ప్లేట్‌లో దోస తీసి రెండో దోశని మళ్లీ వేయాలి. ఈ దోశకి రుచికరమైన సాంబార్, చట్నీతో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.

కొబ్బరి ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీరు వివిధ వంటకాలలో కొబ్బరిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే సంతృప్త కొవ్వు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. కొబ్బరిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది మొటిమలు లేదా మచ్చలను తొలగించడానికి పనిచేస్తుంది.

LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?

Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?