Chicken Pickle: నాన్ వెజ్ ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. ఇంట్లోనే చికెన్ పికిల్ ని చేసుకోండి.. రెసిపీ మీ కోసం

ఆదివారం వస్తే చాలు మటన్, చికెన్ , చేపలు రొయ్యలు వంటి వాటితో చేసిన ఫుడ్ ఉండాల్సిందే. మాంసాహార ప్రియుల్లో చికెన్ ప్రియులు వేరు.. ముక్క లేనిదే ముద్ద దిగదు వీరికి. చికెన్ మాసం ఏదీ లేకపోతె కనీసం గుడ్డుతో నైనా సరే అన్నం తింటారు. అటువంటి నాన్ వెజ్ ప్రియుల కోసమే ప్రస్తుతం రకరకాల నాన్ వెజ్ పచ్చళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అయితేచికెన్, మటన్, రొయ్యలు వంటి మార్కెట్ లో దొరికే నాన్ వెజ్ పచ్చళ్ళు కొనడం కొంచెం ఖరీదు అయినదే. ఈ నేపద్యంలో చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఈ టిప్స్​తో తయారు చేసుకోండి.

Chicken Pickle: నాన్ వెజ్ ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. ఇంట్లోనే చికెన్ పికిల్ ని చేసుకోండి.. రెసిపీ మీ కోసం
Chicken Pickle

Updated on: Jul 22, 2025 | 4:00 PM

నాన్ వెజ్ ప్రియుల కోసం కూరలు, బిర్యానీ, స్నాక్స్ సహా నాన్ వెజ్ పచ్చళ్ళు.. ఇలా రకరకాల ఆహారపదార్ధాలు ఉన్నాయి. అయితే మార్కెట్ లో దొరికే నాన్ పచ్చళ్ళు చికెన్, మటన్, రొయ్యలు, చేపలు ఏదైనా సరే చాలా ఖరీదైన పచ్చడి. అంతేకాదు వీటి తయారీ కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా కొంచెం భయం ఉంటుంది. అప్పుడు తినే ఆహారాన్ని అసంతృప్తిగా ముగిస్తారు. అటువంటి మాంసాహార ప్రియులు కొంచెం సమయం కేటాయిస్తే ఇన్ల్తోనే ఈజీగా చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చు. ఈ టిప్స్ తో పెట్టుకుంటే నెల రోజులకు పైగా చెడిపోకుండా ఉంటుంది. ఈ రోజు చికెన్ పికిల్ రెసిపీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

చికెన్ బోన్ లెస్ – 1 250 గ్రాములు

నువ్వుల నూనె – 400 గ్రాములు

ఇవి కూడా చదవండి

కారం – 50 గ్రాములు

పసుపు – 1 టీ స్పూన్

అల్లం వెల్లులి పేస్ట్ – 60 గ్రాములు

ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క – 1 పెద్దది

యాలకులు – 4

జీలకర్ర – 1 టేబుల్ స్పూన్

మెంతులు – అర టేబుల్ స్పూన్

లవంగాలు – 5

ఉప్పు – రుచికి సరిపడా

నిమ్మరసం – 3 టీ స్పూన్లు

తయారీ విధానం : చికెన్ శుభ్రం చేసుకుని ఆ ముక్కల్లో నూనె, పసుపు, ఉప్పు వేసి.. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని నూనె వేసి చికెన్ ముక్కలు వేయించాలి. మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్​లో చికెన్ను వేయించాలి. ఇప్పుడు చికెన్ లో నీరు బయటకు వస్తుంది. అప్పుడు మూత తీసి చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి నీరు అంతా పోయేలా వరకూ చికెన్ ను వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం మసాలాను రెడీ చేసుకోండి..

స్టవ్ మీద పాన్ పెట్టి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి తక్కువ మంట డ్రై రోస్ట్ చేయాలి. వీటిని చల్లా బెట్టి.. మిక్సిలో వేసుకుని పొడి చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ లో పచ్చడికి కావాల్సిన నూనె వేసుకుని నూనె కొంచెం వేడి అయ్యాక వేయించుకున్న చికెన్ ను వేసి.. కలుపుతూ చికెన్ ముక్కలు ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేవరకూ వేయించి.. ఇప్పుడు ఈ చికెన్ లో టెస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, రెడీ చేసుకున్న చికెన్ పచ్చడి మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత నూనె ఒక పొంగు వచ్చే వరకూ వేడి చేసి.. స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోండి. ఈ చికెన్ పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత రెడీ చేసుకున్న నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్ లో ఉప్పు కారం, పులుపు రుచి చూసుకుని .. మీ టేస్ట్ కి అనుగుణంగా రుచుని ఎడ్జెస్ట్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. దీనిని శుభ్రమైన గాజు సీసాలో స్టోర్ చేసుకుని తడి తగల కుండా ఉపయోగించుకుంటే దాదాపు 3 నెలలు నిల్వ ఉంటుంది. ఎప్పుడు చికెన్ కావాలంటే అప్పుడు ఈ చికెన్ పికిల్ తో అన్నం తినవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..