
చిన్న వయస్సు నుంచే గుండె సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, ఆరోగ్యం మీద చాలా కేర్ తీసుకోవాలి. అయితే, నాన్ వెజ్ తినే వాళ్లలో చికెన్ మంచిదా? మటన్ మంచిదా? అనే సందేహం ఎంతో మందిలో ఉంటుంది. వీటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి దేనికి ఉందో ఇక్కడ చూద్దాం..

చికెన్, మటన్ ఈ రెంటింటిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారికీ చికెన్ మంచిది.

మటన్‌లో పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తం తక్కువగా ఉన్నవారికి మంచి ఫుడ్. మటన్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రెండు వారాలకొకసారి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొందరు ఏం ఆలోచించకుండా మటన్ తినేస్తారు. కానీ, తిన్న తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, గుండె సమస్యలు ఉన్న వారు నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది.

నిపుణులు పరిశోధనలు చేసి చెప్పిన దాని ప్రకారం.. గుండె పోటుతో ఇబ్బంది పడేవారు చికెన్‌ను తక్కువగా తీసుకోవాలని అంటున్నారు. ఇక మటన్ కు దూరం ఉంటేనే బెటర్ అని చెబుతున్నారు.