Heath Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ తినాల్సిందే.. ఆరోగ్యంగా బరువు కూడా తగ్గొచ్చు..

|

Jan 30, 2022 | 8:51 AM

Chia Seeds Benefits: చియా విత్తనాలను సూపర్ ఫుడ్స్ అంటారు. ఇందులో ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం, మలబద్ధకం ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

Heath Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ తినాల్సిందే.. ఆరోగ్యంగా బరువు కూడా తగ్గొచ్చు..
Chia Seeds
Follow us on

Chia Seeds Benefits: మీరు మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉంటే కచ్చితంగా చియా విత్తనాల(Chia Seeds)ను తీసుకోవాలి. చియా విత్తనాలు పోషకరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. దీని గింజలను తినడం వల్ల శరీరంలోని మినరల్స్, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం తొలగిపోతుంది. చియా గింజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది సూపర్ ఫుడ్స్(Super Foods) జాబితాలో చేరింది. చియా గింజల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చియా గింజల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రోజూ చియా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలోనూ మీకు సహాయపడుతుంది. చియాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. చియా విత్తనాలు గుండె, రక్తపోటు, అనేక ఇతర సమస్యలను తొలగిస్తాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తి(Immunity)ని బలపరుస్తుంది. ప్రయోజనాలను తెలుసుకోండి.

చియా విత్తనాల ప్రయోజనాలు..

1. బరువును తగ్గిస్తుంది- చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీన్ని తినడం వల్ల మీ పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. మీరు ఎక్కువగా తినే అలవాటుకు దూరంగా ఉంటారు. దీని కారణంగా బరువు కూడా వేగంగా తగ్గుతుంది. మీరు అల్పాహారంలో చియా గింజలను తీసుకోవచ్చు. దీని వలన కడుపు నిండుగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ దరి చేరదు.

2. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి- చియా గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఒమేగా-3, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. చియా తినడం ద్వారా, శరీరంలో సాల్ట్ లెవల్స్ సాధారణంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు చియా విత్తనాలను తప్పనిసరిగా తీసుకోవాలి. చియా గింజలు రక్తపోటును నియంత్రించే అన్ని పోషకాలను కలిగి ఉంటాయి.

3. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్- గుండె జబ్బులతో బాధపడేవారు కూడా తమ ఆహారంలో చియా గింజలను చేర్చుకోవాలి. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును సాధారణ స్థితికి తెచ్చి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు- చియా గింజలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, మీరు తప్పనిసరిగా రోగ నిరోధక లక్షణాలతో కూడిన ఈ గింజలను ఆహారంలో చేర్చాలి. దీని వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి.

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది- చియా గింజలు రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనం కలిగించే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. చియా విత్తనాలను రోజూ తినడం ద్వారా, మీరు అనేక బాహ్య వ్యాధులను నివారించవచ్చు. చియా సీడ్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

చియా విత్తనాలను ఎలా తినాలి?
చియా విత్తనాలను అనేక విధాలుగా తీసుకోవచ్చు. దీన్ని స్మూతీస్, గ్రానోలా బార్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లు, డిజర్ట్‌లు, కాల్చిన వస్తువులలో కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో వేసి కూడా తాగవచ్చు. ఖాళీ కడుపుతో చియా తినడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండం మంచిది.

Also Read: లవంగం టీతో దగ్గు, జలుబు, గొంతునొప్పి మాయం.. కానీ ఎప్పుడు తాగాలో తెలుసా..?

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?