Turmeric Powder: పసుపు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నిరోధిస్తుందా..! ఇందులో ఉన్న రహస్యం ఏంటి..?

|

Sep 27, 2021 | 10:02 PM

Turmeric Powder: భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన

Turmeric Powder: పసుపు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నిరోధిస్తుందా..! ఇందులో ఉన్న రహస్యం ఏంటి..?
Turmeric
Follow us on

Turmeric Powder: భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును గుర్తించారు ఆయుర్వేద నిపుణులు.. ఎన్నో ఏళ్ల నుంచి సనాతన ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా వాడుతున్నారు. ఎన్నో రోగాలకు మంచి మందుగా పనిచేస్తుంది. తాజాగా జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇందులో ఉండే కర్కుమిన్ కొన్ని వైరస్లను తొలగించడానికి, ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుందని తేలింది.

కర్కుమిన్ అనేది ట్రాన్స్మిసిబుల్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వైరస్ (TGEV) ని నిరోధించగలదని తేలింది. ఇది ఎక్కువగా పందులలో కనిపించే వైరస్‌. కర్కుమిన్ ఈ వైరస్‌ కణాలను చంపుతుందని తేలింది.TGEV అంటువ్యాధి. రెండు వారాల కంటే తక్కువ వయస్సు ఉన్న పందిపిల్లలకు సోకుతుంది. ఇది చాలా ప్రాణాంతకమైనది. కర్కుమిన్ వైరస్ కణాల సంఖ్యను తగ్గిస్తుందని వైద్యులు కనుగొన్నారు.

కర్కుమిన్ TGEV ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో ఇంజనీరింగ్ పరిశోధకుడు మాట్లాడుతూ టిజిఇవి పెరిగే దశపై కర్కుమిన్ గణనీయమైన నివారణ ప్రభావాన్ని కలిగి ఉందన్నారు. అంతేకాదు టిజిఇవి సంక్రమణ నివారణలో కర్కుమిన్ గొప్ప సామర్థ్యాన్ని చూపిస్తుందని తెలిపారు. కర్కుమిన్ డెంగ్యూ వైరస్, హెపటైటిస్ బి, జికా వైరస్‌తో సహా కొన్ని రకాల వైరస్‌లను నిరోధిస్తుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. కర్కుమిన్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుందని అనేక అధ్యయనాలలో తేలింది. కర్కుమిన్ క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మెటాస్టాసిస్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, టైప్ -2 డయాబెటిస్‌ను తగ్గించడంలో కర్కుమిన్ తోడ్పడుతుంది.

IPL 2021, SRH vs RR: హైదరాబాద్ టార్గెట్ 165.. 143 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ చేసిన శాంసన్

Beggars Bank: బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్‌ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు..?

Semi Conductor: చైనాకు షాక్ ఇవ్వనున్న తైవాన్.. భారత్‌లో చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రెడీ!