
Butter Paneer Masala: ఇంట్లో ఎన్నిరకాలుగా కూరలు చేసినా.. రెస్టారెంట్ స్టైల్ లో చేసే కూరలు అంటే చాలామందికి మక్కువ. ముఖ్యంగా రెస్టారెంట్స్ కు వెళ్లిన వారు చాలావరకూ పన్నీర్ బటర్ పన్నీర్ మసాలా ను ఆర్డర్ చేస్తారు. అయితే చాలా తేలికగా రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాల ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోజు బటర్ పన్నీర్ మసాలా తయారీ గురించి తెలుసుకుందాం..!
బటర్ ,
పన్నీర్
గరం మసాలా
ఆయిల్
ఉల్లిపాయలు
టమాటాలు
కసూరిమేతి (లేకపోతే మామూలు మెంతాకు).
ఉప్పు,
కారం ,
పసుపు ,
ధనియాలపొడి
ఆవాలు ,
జీలకర్ర
ఎండుమిర్చి
నానబెట్టిన జీడిపప్పు (లేకపోతే కర్బూజ గింజలు)
కడాయ్ లో కొద్దిగా నూనె వేసి హోల్ గరమ్ మసాలా దినుసులు వేసి , ఉల్లిపాయలు , టమాటాలు , ఉప్పు, కారం , పసుపు, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. చల్లారాక నానబెట్టిన జీడిపప్పు కూడా కలిపి మిక్సీ లో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత … కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు కడయ్ పెట్టుకుని బటర్ వేసుకుని పన్నీర్ ముక్కలు కొద్దిగా వేపి నీళ్ళలో వెయ్యాలి. తర్వాత నూనె వేసి అందులో ఆవాలు , జీలకర్ర ఎండుమిర్చి చిటపటలాడించి.. ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి. తర్వాత బటర్ కూడా పన్నీర్ ముక్కలు కసూరిమేతి వేసి రుచి చూసుకుని దగ్గర పడ్డాక దింపుకోవాలి. అదనపు రుచి కోసం వీలుంటే ఫ్రెష్ క్రీం వేసుకోవచ్చు . అంతే ఎంతో రుచి కరమైన బటర్ పన్నీర్ మసాలా కూర రెడీ.. చపాతీల్లోకి, బిర్యానీలోకి ఎంతో బాగుంటుంది.
Also Read: ఈ ఐదు విషయాలు నమ్మదగినవి కావు, అవి ఎప్పుడైనా మనిషిని మోసం చేయగలవని చెప్పిన చాణిక్యుడు