పనికి రావని సొరకాయ తొక్కలను పడేస్తున్నారా.. ఇలా పచ్చడి చేసి పెట్టండి.. వావ్ అనాల్సిందే..

కూరగాయలతో ఆహారపదార్ధాలను తయారు చేసి.. వాటి తొక్కలను పనికి రావు అంటూ డస్ట్ బిన్ లో పడేస్తారు. అయితే బంగాళదుంప, ఉల్లిపాయ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయల తొక్కలతో అనేక రకాల ఆహార పదార్ధాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి రుచి కరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ రోజు సొరకాయ తోక్కలతో టేస్టీ టేస్టీ చట్నీ తయారు చేసుకోవడం ఎలా తెల్సుకుందాం.. దీనిని పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

పనికి రావని సొరకాయ తొక్కలను పడేస్తున్నారా.. ఇలా పచ్చడి చేసి పెట్టండి.. వావ్ అనాల్సిందే..
Bottle Gourd Peel Chutney

Updated on: Oct 03, 2025 | 3:57 PM

కురగాయాల్లో సొరకాయను వేదకాలం నుంచి మన దేశంలో సాగుచేస్తున్నారు. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సొరకాయతో వడియాలు, పులుసు, కూర, సాంబారు, అట్టు వంటి రకరకాల పదార్దాలను తయారు చేస్తారు. అయితే సొరకాయ తొక్కని ఎందుకూ పనికిరానిదని భావించి పాడేస్తారు. అయితే ఇకపై అలా చేయకండి. ఎందుకంటే మీరు చెత్తగా భావించే సొరకాయ తొక్కతో రుచికరమైన చట్నీ తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. దీన్ని సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్దాలు:

సొరకాయ తొక్క: 1 కప్పు (బాగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి)

  1. పచ్చిమిర్చి: 4 లేక 5 ( రుచికి తగ్గట్టుగా)
  2. అల్లం: 1 చిన్న ముక్క
  3. ఇవి కూడా చదవండి
  4. వెల్లుల్లి: 4-5 రెబ్బలు
  5. జీలకర్ర: అర టీస్పూన్
  6. ఇంగువ: చిటికెడు
  7. ఉప్పు: రుచికి
  8. నిమ్మరసం లేదా చింత పండు: 1 టీస్పూన్
  9. కొత్తిమీర: 2-3 టీస్పూన్లు (తరిగినవి)
  10. కరివేపాకు – రెండు రెమ్మలు
  11. నూనె: 2 టీస్పూన్

పచ్చడి తాలింపుకి కావాల్సిన పదార్ధాలు

  1. శనగపప్పు – కొంచెం
  2. మినప పప్పు- కొంచెం
  3. ఎండు మిర్చి – 2
  4. ఆవాలు –
  5. జీలకర్ర
  6. వెల్లుల్లి
  7. కరివేపాకు –

తయారీ విధానం:

  1. ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టి.. నూనె పోసి వేడి చేయండి. అందులో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి.
  2. ఇప్పుడు సొరకాయ తొక్క ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం , వెల్లుల్లి, కరివేపాకు వేసి.. తొక్క కొద్దిగా మెత్తబడే వరకుఐదు నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత గ్యాస్ ఆపివేసి.. ఈ మిశ్రమాన్ని చల్లబరచండి.
  4. ఇప్పుడు ఈ వేయించిన ఈ సోరకాయ తొక్క మిశ్రమాన్ని మిక్సర్ జార్‌లో వేయండి.
  5. దానికి ఉప్పు, నిమ్మరసం, కట్ చేసిన కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  6. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేడి చేసి శనగపప్పు, మినప పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలీ.
  7. ఈ పోపుని సోరకాయ తొక్కల పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతే రుచికరమైన సొరకాయ తొక్కల చట్నీ సిద్ధం. దీన్ని అన్నం, రోటీ, పరాఠాలకు పప్పుతో కలిపి వడ్డించండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..